Unstoppable Episode 6 Glimpse: ఈ ఫొటో ఎవడేయమన్నాడ్రా.. సీరియస్ అయిపోయిన బాలయ్య.. ఆశ్చర్యపోయిన శ్రీలీల
Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ షోకి ఈసారి శ్రీలీల, నవీన్ పొలిశెట్టిరాగా.. నందమూరి బాలయ్య సరదా ప్రశ్నలు సంధిస్తూనే ఒక ఫొటో విషయంలో సీరియస్ అయిపోయినట్లు కనిపించారు. ఇంతకీ బాలయ్యకి ఆ కోపం తెప్పించిన ఫొటో ఎవరిదో తెలియాలంటే..?
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 4 నుంచి ఎపిసోడ్ 6కి సంబంధించిన గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి గెస్ట్‌లుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చారు. ఈ ఇద్దరితో బాలయ్య చేసిన సందడిని ఎపిసోడ్ 6 గ్లింప్స్‌గా రిలీజ్ చేశారు.
రెండు ఎపిసోడ్‌లు అల్లు అర్జున్ సందడి
అల్లు అర్జున్ ఇటీవల బాలయ్యతో కలిసి సందడి చేయగా.. అయాన్, అర్హ కూడా వచ్చి షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబరు 5న విడుదల కాబోతుండగా.. రెండు ఎపిసోడ్‌లుగా వరుసగా ఆహాలో స్ట్రీమింగ్‌కి ఉంచారు. మూవీ ప్రమోషన్స్‌కి ఇవి చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పుష్ప 2లోనే ఐటెం సాంగ్ చేసిన శ్రీలీలతో ఆరో ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నారు.
కిస్సిక్ సాంగ్‌తో పెరిగిన శ్రీలీల క్రేజ్
పుష్ప 2లో శ్రీలీల చేసిన కిస్సిక్ అనే ఐటెం సాంగ్.. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ పాటతో యూత్‌లో శ్రీలీలకి బాగా క్రేజ్ పెరిగింది. కెరీర్‌లో శ్రీలీల ఇలా ఐటెం సాంగ్ చేయడం ఇదే తొలిసారి. వారం రోజుల పాటు ఈ పాట షూటింగ్‌కి హాజరైన శ్రీలీల.. రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
గాయంతో సినిమాలకి పొలిశెట్టి దూరం
నవీన్ పొలిశెట్టి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. గత ఏడాది సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో నవీన్ ఆఖరిగా కనిపించారు. ఆ తర్వాత యాక్సిడెంట్ కారణంగా గాయంతో షూటింగ్‌కి దూరంగా ఈ యంగ్ హీరో ఉండిపోయాడు.
బాలయ్యకి కోపం తెప్పించి ఫొటో ఏది?
నందమూరి బాలకృష్ణతో కలిసి ఇప్పటికే శ్రీలీల ఒక సినిమా చేసింది. దాంతో ఆ చనువుతో బాలయ్య సరదాగా ఆమెని ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. అలానే నవీన్ పొలిశెట్టి లవ్ ఎఫైర్స్ గురించి కూడా బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించడం గ్లింప్స్‌లో కనిపించింది.
ఈ క్రమంలో కొంత మంది హీరోయిన్స్ ఫొటోల్ని కూడా స్క్రీన్‌పై వేసి చూపిస్తూ ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. అయితే.. ఈ క్రమంలో వచ్చిన ఒక ఫొటోని చూసిన బాలయ్య.. ఎవరు వేయమన్నాడ్రా ఈ ఫొటో అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రొమో సోమవారం ఉదయం 10 గంటలకి విడుదల చేయబోతున్నారు.