Men Health: పురుషుల్లో ఈ అయిదు లక్షణాలు కనిపిస్తే వారికి లైంగిక హార్మోన్ల లోపం ఉన్నట్టే, వెంటనే చికిత్స తీసుకోవాలి-if these five symptoms appear in men then they have sex hormone deficiency ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men Health: పురుషుల్లో ఈ అయిదు లక్షణాలు కనిపిస్తే వారికి లైంగిక హార్మోన్ల లోపం ఉన్నట్టే, వెంటనే చికిత్స తీసుకోవాలి

Men Health: పురుషుల్లో ఈ అయిదు లక్షణాలు కనిపిస్తే వారికి లైంగిక హార్మోన్ల లోపం ఉన్నట్టే, వెంటనే చికిత్స తీసుకోవాలి

Haritha Chappa HT Telugu
Dec 04, 2024 04:30 PM IST

Men Health: పురుషుల లైంగిక హార్మోన్ టెస్టోస్టెరాన్. ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటే వారు లైంగికంగా సమర్థంగా ప్రవర్తించలేరు. టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటే కొన్ని సంకేతాలు పురుషుల్లో కనిపిస్తాయి. వాటిని సరైన సమయంలో గుర్తిస్తే వైద్యుల సలహాతో ఈ హార్మోన్ల అసమతుల్యతను సరిదిద్దుకోవచ్చు.

ఈ లక్షణాలు మగవారిలో కనిపిస్తే కష్టమే
ఈ లక్షణాలు మగవారిలో కనిపిస్తే కష్టమే (Shutterstock)

 బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం… నేడు ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇవి అనేక జీవనశైలి వ్యాధులకు కారణం అవుతుంది. అలాగే ఈ పరిస్థితులు స్త్రీ పురుషుల హార్మోన్లపై కూడా ప్రభావం చూపాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు మునుపటి నుంచి క్రమంగా తగ్గుతున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టెస్టోస్టెరాన్ అనేది మగ సెక్స్ హార్మోన్. ఇది వారి మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యం, సెక్స్ డ్రైవ్, స్పెర్మ్ నాణ్యతను నియంత్రిస్తుంది. ఇది కాకుండా, కండర ద్రవ్యరాశి, ఎముక సాంద్రత, ఎర్ర రక్త కణాలు వంటి ఇతర విధులలో కూడా టెస్టోస్టెరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సుమారు 40 ఏళ్లు దాటిన తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయి స్థాయిలు క్రమంగా తగ్గుతూ ఉండడం సహజం. అయితే నేటి కాలంలో యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు పురుషులలో కనిపించే కొన్ని లక్షణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

తక్కువ టెస్టోస్టోరాన్ లక్షణాలు ఇవే

మగవారు రోజంతా కూర్చున్న తర్వాత కూడా వారికి అలసటగా అనిపించినా, లేదా ఎంతో పని చేసిన తర్వాత ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించినా … అది తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిల లక్షణంగా భావించవచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇది సాధారణం. కానీ పాతికేళ్లు, ముప్పయ్యేళ్ల వయసులో ఉన్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు.   మీకు ఎప్పుడూ శరీరం బలహీనంగా అనిపించినా,   శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉన్నా… వైద్యుడిని సంప్రదించి తగిన  సలహాలు పొందాలి.  

లైంగికాసక్తి తగ్గుతుంది

టెస్టోస్టెరాన్ పురుషుల సెక్స్ డ్రైవ్‌ను నియంత్రించడంలో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది.  తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు పురుషుల లైంగిక జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి పురుషుల్లో క్రమంగా సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గి శృంగారానికి దూరమవుతారు. చాలా సందర్భాలలో, పురుషులలో అంగస్తంభన వంటి సమస్యలు కలుగుతాయి. మీ లైంగిక జీవితంలో సంతృప్తి లేకపోయినా, మీ జీవిత భాగస్వామి సంతృప్తి చెందకపోయినా కూడా మీరు వెంటనే వైద్యులను కలవాలి. 

టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, పురుషుల శరీరంలో కొన్ని  మార్పులు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇది శరీర కొవ్వును ప్రభావితం చేస్తుంది. టెస్టోస్టెరాన్ లోపం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.  ఇది పొట్ట, ఛాతీ భాగాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గితే మగ వారికి వక్షోజాలు పెరిగే అవకాశం ఉంది.  అలాగే ముఖం, చేతులు, కాళ్ళు, జఘన ప్రాంతంలో జుట్టు పెరిగే అవకాశం ఉంది.   మీలో కూడా ఇటువంటి ఆకస్మిక మార్పులు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాలి. 

టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం కూడా పురుషుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. పురుషులు పని పట్ల ఉత్సాహాన్ని కోల్పోతారు. టెస్టోస్టోరాన్ స్థాయిలు తగ్గితే  నిరాశ, నిస్పృహగా, బలహీనంగా మారుతారు. చిన్న చిన్న పనులు చేసిన తర్వాత కూడా వారి ఒత్తిడి చాలా పెరుగుతుంది.  ఇది వారు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలను పెంచుతుంది. మీలో కూడా మీ మానసిక స్థితిలో ఈ ప్రతికూల మార్పును చూస్తున్నట్లయితే, వెంటనే చికిత్స తీసుకోవాలి.

పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గితే ఇది ఎముకలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి అనే వ్యాధికి కూడా దారితీస్తుంది. దీనితో పాటు ఎముకల బలహీనత వల్ల పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ లేకపోవడం వల్ల, ఎముకల బలహీనత కూడా యువతలో కనిపిస్తుంది.

Whats_app_banner