OnePlus Nord CE 4: ఈ డిస్కౌంట్ తో రూ.20,000 లోపు ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4; ఎక్కడంటే..?-oneplus nord ce 4 under rs 20000 on amazon check out bank and exchange offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 4: ఈ డిస్కౌంట్ తో రూ.20,000 లోపు ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4; ఎక్కడంటే..?

OnePlus Nord CE 4: ఈ డిస్కౌంట్ తో రూ.20,000 లోపు ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4; ఎక్కడంటే..?

Sudarshan V HT Telugu
Dec 04, 2024 03:28 PM IST

OnePlus Nord CE 4: సక్సెస్ ఫుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్ తో అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ను రూ .20,000 లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

 ఈ డిస్కౌంట్ తో రూ.20,000 లోపు ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4
ఈ డిస్కౌంట్ తో రూ.20,000 లోపు ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus)

OnePlus Nord CE 4: స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ కోసం చూస్తున్నారా? కానీ, పరిమిత బడ్జెట్ వల్ల మీ ఆశ నెరవేరడం లేదా?.. అయితే, వెంటనే అమెజాన్ లో స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్ ను పరిశీలించండి. ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ సిఇ 4 అమెజాన్ లో రూ. 20 వేల లోపు ధరకే లభిస్తుంది. శక్తివంతమైన పనితీరు, మంచి కెమెరా, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ గా వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 కి పేరుంది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ దాని కొత్త డిజైన్, మెరుగైన స్పెసిఫికేషన్లు, శక్తివంతమైన పనితీరుకు ఇది పేరుగాంచింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ధర సుమారు రూ.25,000 కాగా, అమెజాన్ నుంచి కొనుగోలుదారులు దీన్ని రూ.20,000 లోపు ధరకే పొందవచ్చు.

వన్ ప్లస్ నార్డ్ సీఈ4 డిస్కౌంట్

8 జీబీ ర్యామ్, 12 జీబీ స్టోరేజ్ ఉన్న వన్ ప్లస్ నార్డ్ సీఈ4 స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ.24999 గా ఉంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.20000 లోపు ధరలో అమెజాన్ లో పొందవచ్చు. అందుకు కొన్ని బ్యాంక్ ఆఫర్స్ (OFFERS), ఎక్స్చేంజ్ ఆఫర్లను ఉపయోగించాలి. అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.1000 తక్షణ తగ్గింపు ఆఫర్ ను వాడవచ్చు. లేదా, కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 నెలలు, అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. చివరగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో అమెజాన్ (amazon) వన్ ప్లస్ నార్డ్ సిఇ 4 పై గరిష్టంగా రూ .21000 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ స్మార్ట్ ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్స్ పై ఆధారపడి ఉంటుందని గమనించండి.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రత్యేకతలు

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ కు అదనంగా, మరో 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ ను అందించారు. వన్ ప్లస్ నార్డ్ (oneplus) సీఈ 4 డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సోనీ ఎల్వైటి 600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సార్ తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) స్మార్ట్ ఫోన్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారుల అలవాట్ల ఆధారంగా ఛార్జింగ్ ను విశ్లేషించి ఆప్టిమైజ్ చేసే స్మార్ట్ ఛార్జింగ్ 4.0 ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Whats_app_banner