OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4పై భారీ డిస్కౌంట్- తక్కువ ధరకే సూపర్​ ఫీచర్స్​!-oneplus nord ce 4 gets 3 000 discount on amazon should you buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4పై భారీ డిస్కౌంట్- తక్కువ ధరకే సూపర్​ ఫీచర్స్​!

OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4పై భారీ డిస్కౌంట్- తక్కువ ధరకే సూపర్​ ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu
Aug 24, 2024 01:40 PM IST

OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4 స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​లో మంచి డిస్కౌంట్​ లభిస్తోంది. డిస్కౌంట్​తో పాటు ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4
వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4

వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​లో భారీ డిస్కౌంట్​ లభిస్తోంది! ఈ ఏడాది ఏప్రిల్​లో లాంచ్ అయిన ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పుడు భారీ డిస్కౌంట్​ పొందొచ్చు. అమెజాన్​ తాజా డిస్కౌంట్​తో ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 25వేల నుంచి దాదాపు రూ. 20వేలకు పడిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4పై డిస్కౌంట్​..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 4 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్​​ ధర రూ.24,999గా ఉంది. తాజా డిస్కౌంట్​తో ఫోన్ ఈ ధర రూ. 21,999కి పడిపోయింది. ఐసీఐసీఐ లేదా వన్ కార్డ్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ.3,000 ఇన్​స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్​ కొద్ది రోజుల మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. త్వరపడితే మంచి డీల్​ దొరుకుతుంది!

ఇదీ చూడండి:- iPhone 16 launch: ఎక్కువ ధర పెట్టి ఐఫోన్ 16 ప్రొ కొనడం కన్నా ఐఫోన్16 కొనడం బెటర్.. ఎందుకంటే?

వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 స్పెసిఫికేషన్లు..

వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 2412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇది 210 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, హెచ్​డీఆర్ 10+ కలర్ సర్టిఫికేషన్, 10-బిట్ కలర్ డెప్త్​ని సపోర్ట్ చేస్తుంది.

నార్డ్ సీఈ 4 5జీలో క్వాల్కం స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3ఎస్ఓసీ, అడ్రినో 720 జీపీయూ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్​ని అందించారు.

50 మెగాపిక్సెల్ సోనీ ఎల్​వైటీ 600 ప్రైమరీ సెన్సార్+ 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్​తో డ్యూయల్ రేర్​ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. నార్డ్ సీఈ 4 5జీ స్మార్ట్​ఫోన్​ వెనుక కెమెరాతో 30 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియోలను రికార్డ్ చేయగలదు (అల్ట్రా-స్టెడీ వీడియోలకు 60 ఎఫ్పీఎస్ వద్ద 1080పీ), అలాగే ఫ్రెంట్ కెమెరాతో 30 ఎఫ్పీఎస్ వద్ద 1080పీ వీడియోని చిత్రీకరించవచ్చు.

వన్​ప్లస్​ 12ఆర్ నుంచి ప్రేరణ పొంది, సీఈ 4 5జీ స్మార్ట్​ఫోన్​ గణనీయమైన 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. నార్డ్ పరికరంలో అతిపెద్దది ఇదే! 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జర్​తో ఇది కనెక్ట్​ చేసి ఉంటుంది. సుమారు 29 నిమిషాల్లో పరికరాన్ని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం