OnePlus Nord CE 4: అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రీమియం స్మార్ట్ ఫోన్-oneplus nord ce 4 available below rs 25 000 on amazon heres how the deal works ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Ce 4: అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రీమియం స్మార్ట్ ఫోన్

OnePlus Nord CE 4: అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రీమియం స్మార్ట్ ఫోన్

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 04:58 PM IST

OnePlus Nord CE 4: వన్ కమ్యూనిటీ సేల్ సందర్భంగా వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ధర గణనీయంగా తగ్గింది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ, డ్యూయల్ రియర్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఈ న్ ప్లస్ నార్డ్ సీఈ 4 లో ఉన్నాయి.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్

జూన్ 6 నుంచి 11 వరకు జరుగుతున్న వన్ కమ్యూనిటీ సేల్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ పై గణనీయమైన డిస్కౌంట్ లభిస్తుంది. వన్ ప్లస్ కంపెనీ నార్డ్ 4, నార్డ్ సీఈ 4 లైట్ స్మార్ట్ ఫోన్లను త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుందనే వార్తలు వస్తున్నాయి.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4 5G) స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.26,999గా నిర్ణయించారు. అయితే వన్ కమ్యూనిటీ సేల్ సందర్భంగా వన్ ప్లస్ అమేజాన్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లు, ఇతర అధికారిక భాగస్వామ్య స్టోర్ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో చెల్లింపులు జరిపే వారికి కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ (OnePlus Nord CE 4 5G) స్మార్ట్ ఫోన్ లో 2412×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే,ఉంటుంది. ఇందులో 210 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, హెచ్డిఆర్ 10+ కలర్ సర్టిఫికేషన్, 10-బిట్ కలర్ డెప్త్ సపోర్ట్ లభిస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్

నార్డ్ సీఈ 4 5 జీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసితో పనిచేస్తుంది. ఇందులో గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ పనుల కోసం అడ్రినో 720 జిపియు కూడా ఉంటుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ను ఇందులో అందించారు.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ కెమెరా

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్ వైటీ 600 ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ

నార్డ్ సీఈ 4 5జీ (OnePlus Nord CE 4 5G) రియర్ కెమెరా నుంచి 30 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియోను (అల్ట్రా-స్టెడీ కెమెరా కోసం 60 ఎఫ్పీఎస్ వద్ద 1080పీ వీడియో), ఫ్రంట్ కెమెరా నుంచి 30ఎఫ్పీఎస్ వద్ద 1080పీ చొప్పున షూట్ చేయగలదు. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ (నార్డ్ డివైజెస్ లో అతిపెద్దది) ని పొందుపర్చారు. ఇది 100వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం డివైజ్ ను పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

Whats_app_banner