OnePlus Nord 4 : త్వరలోనే వన్​ప్లస్ నార్డ్​​ 4 లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!-oneplus nord 4 launching soon in india from camera to processor everything you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord 4 : త్వరలోనే వన్​ప్లస్ నార్డ్​​ 4 లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

OnePlus Nord 4 : త్వరలోనే వన్​ప్లస్ నార్డ్​​ 4 లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Jun 02, 2024 06:20 PM IST

OnePlus Nord 4 : వన్​ప్లస్​ నార్డ్ 4 త్వరలో భారతదేశంలో అరంగేట్రం చేయనుంది. స్పెసిఫికేషన్ల పరంగా ఈ స్మార్ట్​ఫోన్​లో ఏమి ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోండి..

లాంచ్​కు రెడీ అవుతున్న వన్​ప్లస్​ నార్డ్​ 4..
లాంచ్​కు రెడీ అవుతున్న వన్​ప్లస్​ నార్డ్​ 4.. (OnePlus)

OnePlus Nord 4 India launch : లీకులు, పుకార్ల కారణంగా వన్​ప్లస్​ నార్డ్ 4 కొంతకాలంగా చర్చల్లో ఉంది. కొత్త తరం నార్డ్ లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ.. టిప్​స్టర్లు స్మార్ట్​ఫోన్స్​ ఆశించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వెల్లడించడంలో మరింత చురుకుగా ఉన్నారు. భారతదేశంలో వన్​ప్లస్ నార్డ్ 4 లాంచ్​కు ఇంకా ఒక నెల సమయం ఉన్న తరుణంలో.. ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్ నార్డ్ 4 ఆశించే స్పెసిఫికేషన్లు..

లీకుల ప్రకారం.. వన్​ప్లస్ నార్డ్ 4 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​ 1.5కే రిజల్యూషన్​తో 6.74 ఇంచ్​ అమోలెడ్ డిస్ల్పేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

OnePlus Nord 4 price in India : వన్​ప్లస్​ నార్డ్ 4 స్మార్ట్​ఫోన్​లో.. 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో కూడిన డ్యూయెల్ కెమెరా సెటప్​ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. 100వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. చివరిగా, నార్డ్ 4 ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 పై పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్​ఫోన్ గీక్​బెంచ్ లిస్టింగ్ లో మోడల్ నంబర్ సీపీహెచ్​2621లో కూడా కనిపించింది.

వన్​ప్లస్ నార్డ్ 4 ధర, లాంచ్ టైమ్​లైన్​..

ప్రస్తుతానికి, వన్​ప్లస్ నార్డ్ 4 దాని మునుపటి ధరతో సమానంగా ఉండే అవకాశం ఉంది. నార్డ్ 3 ప్రారంభ ధర రూ.33,999గా ఉంది. మరోవైపు వన్​ప్లస్​ నార్డ్ 4 స్మార్ట్​ఫోన్​ జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, అధికారిక లాంచ్ తేదీని సంస్థ ఇంకా ధృవీకరించలేదు.

OnePlus Nord 4 launch date in India : నార్డ్ 4 స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్ లీకులు, ఊహాగానాలపై ఆధారపడి ఉంటుంది. త్వరలోనే వీటిపై పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వివో ఎస్​19 లాంచ్​..

Vivo V19 launch in India : వివో తన లేటెస్ట్ స్మార్ట్​ఫోన్స్​.. వివో ఎస్​19, వివో ఎస్19 ప్రోలను చైనాలో లాంచ్​ చేసింది. 50 మెగాపిక్సెల్ రియర్, సెల్ఫీ కెమెరాలు, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4తో పనిచేస్తాయి. డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టిన వివో ఎస్18 లైనప్​ని అనుసరిస్తూ.. ఈ మోడల్స్​లో కూడా పలు కీలక ఫీచర్స్​ని కొనసాగించింది వివో సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం