Vivo S19 : వివో ఎస్19, ఎస్​ 19ప్రో లాంచ్​.. ధరలు, ఫీచర్స్​ ఇవే!-vivo s19 and vivo s19 pro launched check price specs features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo S19 : వివో ఎస్19, ఎస్​ 19ప్రో లాంచ్​.. ధరలు, ఫీచర్స్​ ఇవే!

Vivo S19 : వివో ఎస్19, ఎస్​ 19ప్రో లాంచ్​.. ధరలు, ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Jun 01, 2024 08:06 AM IST

Vivo S19 and Vivo S19 Pro launched : వివో ఎస్19, ఎస్​19 ప్రో స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అయ్యాయి. వీటి ధరలు, ఫీచర్స్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎస్​19, ఎస్​19 ప్రో లాంచ్​..
వివో ఎస్​19, ఎస్​19 ప్రో లాంచ్​.. ( Vivo)

Vivo S19 launch date in India : వివో తన లేటెస్ట్ స్మార్ట్​ఫోన్స్​.. వివో ఎస్​19, వివో ఎస్19 ప్రోలను చైనాలో లాంచ్​ చేసింది. 50 మెగాపిక్సెల్ రియర్, సెల్ఫీ కెమెరాలు, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4తో పనిచేస్తాయి. డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టిన వివో ఎస్18 లైనప్​ని అనుసరిస్తూ.. ఈ మోడల్స్​లో కూడా పలు కీలక ఫీచర్స్​ని కొనసాగించింది వివో సంస్థ.

వివో ఎస్19, వివో ఎస్19 ప్రో ధర..

వివో ఎస్​19 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా(సుమారు రూ.28,8000) ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.38,000) ఉంది. వివో ఎస్ 19ప్రో 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.38,000) ఉంది. 16 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా(సుమారు రూ.46,100) ఉంది.

Vivo S19 pro price : ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​.. వివో చైనాఇ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. వివో ఎస్19 మిస్టీ బ్లూ, పీచ్ బ్లాసమ్ ఫ్యాన్, పైన్ స్మోక్ ఇంక్ వంటి కలర్ ఆప్షన్స్​లో అందుబాటులోకి వచ్చింది. ప్రో మోడల్ మిస్టీ బ్లూ, స్వోర్డ్ షాడో గ్రే, గ్రీన్ మౌంటెన్స్ రంగుల్లో లభిస్తుంది.

వివో ఎస్19, ఎస్​19 ప్రో: స్పెసిఫికేషన్లు

వివో ఎస్​ 19, ఎస్​19 ప్రో.. 6.78 ఇంచ్​ 1.5 కె ఓఎల్​ఈడీ డిస్​ప్లేలను 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్​నెస్. 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తున్నాయి. బేస్ మోడల్ కోసం స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ, ప్రో వెర్షన్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్​తో పనిచేసే ఇవి.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయి.

Vivo S19 specifications : కెమెరాల విషయానికొస్తే, వివో ఎస్19 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవి 50 ఈ ప్రైమరీ సెన్సార్​ని కలిగి ఉంది. ప్రో మోడల్లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ రియర్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వివో ఎస్19 ప్రోలో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ ఉంది. రెండు డివైజ్​లలో 50 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.

వివో ఎస్ 19 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ప్రో వేరియంట్​లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 5జీ, డ్యూయెల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Vivo S19 : మరి ఈ మోడల్స్​ ఇండియాలో ఎప్పుడు లాంచ్​ అవుతాయో.. వివో సంస్థ చెప్పలేదు! త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం