OnePlus: ఇకపై అన్ని జియోమార్ట్ స్టోర్ట్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్; చిన్న పట్టణాల్లోనూ లభ్యం-oneplus partners with jiomart digital smartphones to be available across 63 000 plus retail stores in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus: ఇకపై అన్ని జియోమార్ట్ స్టోర్ట్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్; చిన్న పట్టణాల్లోనూ లభ్యం

OnePlus: ఇకపై అన్ని జియోమార్ట్ స్టోర్ట్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్; చిన్న పట్టణాల్లోనూ లభ్యం

HT Telugu Desk HT Telugu
Published May 11, 2024 04:44 PM IST

ఇకపై వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ అన్నిరిలయన్స్ జియో మార్ట్ డిజిటల్ స్టోర్స్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు జియో మార్ట్, వన్ ప్లస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లభించే స్టోర్స్ సంఖ్య భారీగా పెరుగుతుంది. భారతదేశంలో సుమారు 63,000 జియో మార్ట్ రిటైల్ స్టోర్లు ఉన్నాయి.

ఇక జియో మార్ట్ స్టోర్స్ లో వన్ ప్లస్ ఫోన్స్
ఇక జియో మార్ట్ స్టోర్స్ లో వన్ ప్లస్ ఫోన్స్ (OnePlus)

OnePlus phones in Jiomart stores: జియోమార్ట్ డిజిటల్ తో వన్ ప్లస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై వన్ ప్లస్ డివైజ్ లు గతంలో కంటే ఎక్కువ స్టోర్ట్స్ లో అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్ ఉత్పత్తులు ఇప్పుడు 63,000+ జియో మార్ట్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్, జియో మార్ట్ ల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో భారత్ లోని టైర్ 3, టైర్ 4 పట్టణాలు సహా దేశవ్యాప్తంగా 2000 కు పైగా నగరాలు, పట్టణాలలో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయి.

రిటైలర్లతో సహకారం

జియో మార్ట్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం పై వన్ ప్లస్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. "వన్ ప్లస్, జియోమార్ట్ డిజిటల్ రిటైల్ భాగస్వామ్యం హర్షణీయం. మా వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాం’ అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆఫ్ లైన్ రిటైల్ డైనమిక్స్ లో ఇటీవలి మార్పుల మధ్య, దక్షిణ భారతదేశంలోని కొన్ని రిటైలర్లు వన్ ప్లస్ అమ్మకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, రిటైలర్ల సహకారంతో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తామని వన్ ప్లస్ చెబుతోంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

వన్ ప్లస్ ఇటీవల విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ధరను వివిధ స్టోరేజ్ వేరియంట్లకు వరుసగా రూ.24,999, రూ.26,999 లుగా నిర్ణయించారు. ఇవి సెలాడన్ మార్బుల్, డార్క్ క్రోమ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4లో 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ వోసీ, 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా లేఅవుట్ ను కలిగి ఉంది, వీటిలో ఓఐఎస్ తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, అలాగే ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 100 వాట్ వైర్డ్ సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

Whats_app_banner