OnePlus 12R: ఆక్వా టచ్ తో వన్ ప్లస్ 12 ఆర్; ఇది మోస్ట్ పవర్ ఫుల్ 'ఆర్' మోడల్-oneplus 12r oneplus most powerful r model with aqua touch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 12r: ఆక్వా టచ్ తో వన్ ప్లస్ 12 ఆర్; ఇది మోస్ట్ పవర్ ఫుల్ 'ఆర్' మోడల్

OnePlus 12R: ఆక్వా టచ్ తో వన్ ప్లస్ 12 ఆర్; ఇది మోస్ట్ పవర్ ఫుల్ 'ఆర్' మోడల్

HT Telugu Desk HT Telugu
Apr 05, 2024 08:43 PM IST

OnePlus 12R: వన్ ప్లస్ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన 'ఆర్' మోడల్ వన్ ప్లస్ 12ఆర్. ఇందులో విప్లవాత్మకమైన ఆక్వా టచ్ ఫీచర్ ను ప్రవేశపెట్టారు. ఈ వేసవిలో వన్ ప్లస్ 12 ఆర్ తో చల్లని అనుభూతిని పొందండి.

వన్ ప్లస్ 12 ఆర్ స్మార్ట్ ఫోన్
వన్ ప్లస్ 12 ఆర్ స్మార్ట్ ఫోన్ (OnePlus)

OnePlus 12R with Aqua touch: ఎండాకాలం వచ్చేసింది, అలాగే చల్లని పానీయాలు, స్విమ్మింగ్, బీచ్ సెలవుల సమయం కూడా వచ్చింది! కానీ, మీరు స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చినప్పుడు లేదా గడ్డకట్టిన గ్లాస్ ను కిందకు దింపి, తడి వేళ్ళతో సందేశాన్ని టైప్ చేయడానికి మీ స్మార్ట్ ఫోన్ ను ఆపరేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. తడి చేతులతో చాలా డిస్ ప్లేలు ప్రతిస్పందించవు. తడి చేతులతో సరైన బటన్ ను టైప్ చేయలేము.

ఆక్వా టచ్ ఫీచర్

ఆ సమస్యను తీర్చడానికి, ఈ వేసవిని మరింత ఆహ్లాదభరితం చేయడానికి వన్ ప్లస్ నుంచి శక్తిమంతమైన మోడల్ వన్ ప్లస్ 12 ఆర్ (OnePlus 12R) మార్కెట్లోకి వచ్చింది. ఇందులో విప్లవాత్మక ఆక్వా టచ్ ఫీచర్ (Aqua touch) ఉంటుంది.ఈ ఫీచర్ తో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను తడి వేళ్లతో కూడా ఆపరేట్ చేయవచ్చు. అంటే, అత్యవసరంగా ఫోన్ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు, చేతులు తడిగా ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్య లేకుండా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు.

వన్ ప్లస్ 12ఆర్ లో ఇంకా చాలా ఫీచర్స్

సరికొత్త వన్ ప్లస్ 12ఆర్ (OnePlus 12R) స్మార్ట్ ఫోన్ లో ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. వన్ ప్లస్ 12 ఆర్ స్మార్ట్ ఫోన్ లో అత్యంత అధునాతన డిస్ ప్లే, వినూత్నమైన రెయిన్ ప్రొటెక్షన్ తో వస్తోంది. ఇందులో ఫోర్త్ జనరేషన్ ఎల్టీపీఓ 120 హెర్ట్జ్ ప్రోఎక్స్ డీ ఆర్ డిస్ ప్లే ఉంటుంది. ఇది 4500 నిట్స్ అప్ గ్రేడెడ్ పీక్ బ్రైట్ నెస్ ను, ట్రూ-టు-లైఫ్ కలర్స్ ను, వేగవంతమైన ప్రతిస్పందనను అందిస్తుంది. డాల్బీ విజన్ తో తెరపై ప్రతి దృశ్యానికి ప్రాణం పోసే అద్భుతమైన డిస్ ప్లే ఇది.

వన్ ప్లస్ 12ఆర్.. కళ్లను ప్రొటెక్ట్ చేయడానికి..

స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోయి గంటల తరబడి గడుపుతున్నాం. దాని ప్రభావం కళ్లపై స్పష్టంగా కనిపిస్తుంది. మీ వన్ ప్లస్ 12ఆర్ (OnePlus 12R) మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది ఇంటెలిజెంట్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. తద్వారా మీరు ఎక్కువసేపు గొప్ప వివరాలను చూడవచ్చు.చాలా హై-ఎండ్ స్మార్ట్ ఫోన్ లు అధిక రిఫ్రెష్ రేట్లతో రూపొందించబడుతున్నాయి. కానీ, వన్ ప్లస్ 12ఆర్ ఎల్టీపీఓ 4.0 ఫీచర్ ప్రత్యేకమైనది. ఇది ఇంటెలిజెంట్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఇది మీరు స్మార్ట్ ఫోన్ ను దేని కోసం ఉపయోగిస్తున్నారో దాని ఆధారంగా అవసరమైన రిఫ్రెష్ రేట్ ను సిద్ధం చేస్తుంది. కాబట్టి, మీరు ఒక గేమ్ ఆడుతున్నట్లయితే, ఇది రిఫ్రెష్ రేటును దాని గరిష్ట స్థాయి 120 హెర్ట్జ్ వద్ద ఉంచుతుంది. కానీ మీరు ఏదైనా చదువుతున్నప్పుడు లేదా నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నప్పుడు, రిఫ్రెష్ రేటు ఆటోమేటిక్ గా 1 హెర్ట్జ్ కంటే తక్కువకు తగ్గుతుంది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది, బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.

స్ట్రాంగ్ స్మార్ట్ ఫోన్

వన్ ప్లస్ ఇప్పటి వరకు తయారు చేసిన అత్యంత దృఢమైన స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 12ఆర్ (OnePlus 12R). తయారీలో 20 శాతానికి పైగా అల్యూమినియం ఉపయోగించిన మొదటి వన్ ప్లస్ మోడల్ ఇది. ఇది నీరు, ధూళి నిరోధకత కోసం ఐపి 64 రేటింగ్ తో వస్తుంది.

వన్ ప్లస్ 12ఆర్.. స్పెసిఫికేషన్స్

వన్ ప్లస్ 12ఆర్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. ఇది 35 శాతం మెరుగైన సీపీయూ పనితీరును, 25 శాతం మెరుగైన జీపీయూ పనితీరును అందిస్తుంది. యూఎఫ్ఎస్ 4.0 ఆర్ఓఎం (ROM) తో 133 శాతం అధిక వేగాన్ని పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వన్ ప్లస్ (OnePlus) స్మార్ట్ ఫోన్ల లో ఇంతవరకు ఇంత భారీ బ్యాటరీని అమర్చలేదు. ఈ బ్యాటరీ 26 నిమిషాల్లోనే 1 నుంచి 100 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ను ఆప్టిమైజ్ చేసే 100వాట్ సూపర్ వూక్ ఫంక్షన్ ద్వారా ఇది సాధ్యమైంది.

WhatsApp channel