Realme C65 : రియల్మీ నుంచి కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. ధర రూ. 10వేల కన్నా తక్కువే!
Realme C65 5G : రియల్మీ సంస్థ ఓ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని రెడీ చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధరపై అంచనాలు వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
Realme C65 5G price in India : ఇండియా స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లోని బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు పోటీపడి మరీ కొత్త కొత్త డివైజ్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. రియల్మీ సంస్థ నుంచి ఓ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు రియల్మీ సీ65 అని టాక్ నడుస్తోంది. బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ తన వినియోగదారుల బేస్‌ని అభివృద్ధి చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ సీ65 గ్యాడ్జెట్‌ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
రియల్మీ సీ65.. ధర ఎంత?
కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ పేరును సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే పలు లీకులు, ఊహాగానాల కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ గుర్తింపు పొందడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ పేరు రియల్మీ సీ65 కావచ్చని, ఇది 6 జీబీ ర్యామ్‌తో వస్తుందని రూమర్స్ మొదలయ్యాయి. దీనికి తోడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేసే ధరలు కూడా వెల్లడయ్యాయి.
Realme C65 price : 91మొబైల్స్ హిందీ నివేదిక ప్రకారం.. కొత్త బడ్జెట్ ఫ్రెడ్లీ స్మార్ట్‌ఫోన్ రియల్మీ సీ65 ధర రూ.10,000 లోపు ఉండొచ్చు. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ ర్యామ్- 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండొచ్చు. ఈ ఇండియాలో.. రియల్మీ 12ఎక్స్ 5జీని బుధవారం, వియత్నాంలో ఏప్రిల్ 4న రియల్మీ సీ65 లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం రియల్మీ సీ650 స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
రియల్మీ సీ65 స్పెసిఫికేషన్లు..
పలు నివేదికల ప్రకారం.. రియల్మీ సీ65లో 6.67 ఇంచ్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్ వంటివి ఉంటాయి. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది. రియల్మీ సీ65 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.
Realme C65 5G specifications : రియల్మీ సీ65 డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్‌తో పాటు ఫ్లిక్కర్ సెన్సార్ ను కలిగి ఉండవచ్చు. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను వచ్చే అవకాశం ఉంది. భద్రత కోసం, ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది. ఈ పరికరం ఆండ్రాయిడ్ 14 పై పనిచేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. చివరగా.. రియల్మీ సీ65.. వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ పొందుతుందని భావిస్తున్నారు.
ఈ రియల్మీ సీ65 గ్లోబల్ లాంచ్ తేదీని రియల్మీ ఇంకా ప్రకటించలేదు. స్పెసిఫికేషన్స్, ధర కూడా ప్రస్తుతం రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. వీటిని సంస్థ ఇంకా ధ్రువీకరించలేదు. త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానెల్‌ని అనుసరించండి.
సంబంధిత కథనం