Poco M6 5G launch: అన్ని ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ పోకో ఎం6 5జీ; ధర ఎంతంటే..?-poco m6 5g launched in india with airtel exclusive offers check features availability and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco M6 5g Launch: అన్ని ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ పోకో ఎం6 5జీ; ధర ఎంతంటే..?

Poco M6 5G launch: అన్ని ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ పోకో ఎం6 5జీ; ధర ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu
Published Mar 08, 2024 06:00 PM IST

Poco M6 5G launch: ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో పోకో ఇండియా, ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో, ఎక్స్ క్లూజివ్ ఆఫర్స్ తో తన సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ పోకో ఎం6 5జీని భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,799 గా నిర్ణయించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్
పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్

Poco M6 5G Airtel-exclusive variant: పోకో తన అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. పోకో ఎం6 5జీ ఇప్పుడు ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం వన్-టైమ్ డేటా ప్యాకేజీ ఆఫర్ తో ఎయిర్టెల్-ఎక్స్క్లూజివ్ గా వినియోగదారుల ముందుకు వస్తోంది. పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 18 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. పోకో సీ 51 వేరియంట్ ను గతంలో రూ .5999 వద్ద ప్రవేశపెట్టిన తరువాత, మరోసారి ఎయిర్టెల్ భాగస్వామ్యంతో పోకో మరోసారి పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇందులో 50 జీబీ వన్-టైమ్ మొబైల్ డేటా ఆఫర్ ఉంది.

ఎయిర్ టెల్ తో కలిసి..

ఎయిర్ టెల్ తో మరోసారి భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని పోకో తెలిపింది. ఈ భాగస్వామ్యంతో పోకో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎయిర్ టెల్ విస్తృత నెట్ వర్క్ కలిసి వినియోగదారులను ఆకట్టుకుంటాయని విశ్వసిస్తున్నామని వెల్లడించింది. ముఖ్యంగా యువతను 5 జీ నెట్ వర్క్ పై పని చేసే ఈ పోక్ - ఎయిర్టెల్ కాంబో విశేషంగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపింది.

మూడు రంగుల్లో..

పోకో ఎం6 5జీ ఎయిర్టెల్ ఎక్స్క్లూజివ్ వేరియంట్ గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ, పోలారిస్ గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 4 జీబీ + 128 జీబీ, 6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ అనే మూడు ర్యామ్, స్టోరేజ్ కలయికలతో ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.8799 ల ప్రారంభ ధరతో మార్చి 10న మార్కెట్లోకి రానుంది.

ఎయిర్ టెల్ ఎక్స్ క్లూజివ్ ఆఫర్

ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే, వారికి 50 జీబీ వన్ టైమ్ మొబైల్ డేటా బోనస్ గా ఎయిర్ టెల్ అందిస్తుంది. నాన్ ఎయిర్ టెల్ యూజర్లు డోర్ స్టెప్ సిమ్ డెలివరీని ఎంచుకోవచ్చు. ఇందులో ఇన్ స్టంట్ యాక్టివేషన్ తో పాటు 50 జీబీ బెనిఫిట్ కూడా ఉంటుంది.

పోకో ఎం6 5జీ ఫీచర్స్

పోకో ఎం6 5జీ ఎయిర్ టెల్ ఎక్స్ క్లూజివ్ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ వోసీ, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఆప్షన్లను వినియోగదారులు పొందవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్లో 6.74 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.

కెమెరా సెటప్

ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ఏఐ ఆధారిత మెయిన్ సెన్సార్, సెకండరీ లెన్స్ తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు.

Whats_app_banner