Realme Narzo 70 Pro : సూపర్​ ఫీచర్స్​తో రియల్​మీ నార్జో 70 ప్రో.. త్వరలోనే లాంచ్​!-realme narzo 70 pro set to launch soon check rumoured features specs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Realme Narzo 70 Pro Set To Launch Soon; Check Rumoured Features, Specs

Realme Narzo 70 Pro : సూపర్​ ఫీచర్స్​తో రియల్​మీ నార్జో 70 ప్రో.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Mar 08, 2024 08:55 AM IST

Realme Narzo 70 Pro 5G : సూపర్​ ఫీచర్స్​తో రియల్​మీ నార్జో 70 ప్రో.. త్వరలోనే ఇండియాలో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​పై ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

రియల్​మీ నార్జో 70 ప్రో వచ్చేస్తోంది..
రియల్​మీ నార్జో 70 ప్రో వచ్చేస్తోంది.. (Amazon)

Realme Narzo 70 Pro 5G price in India : రియల్​మీ నార్జో 70 ప్రో స్మార్ట్​ఫోన్​.. ఈ నెలలోనే ఇండియాలో లాంచ్​కానుంది. అమెజాన్​ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఇక ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​పై కాస్త క్లారిటీ వచ్చింది. స్పెసిఫికేషన్స్​తో పాటు ఈ రియల్​మీ నార్జో 70 ప్రోకు చెందిన ఇతర విశేషాలను ఇక్కడ చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

రియల్​మీ నార్జో 70 ప్రో స్పెసిఫికేషన్స్​ ఇవేనా..?

రియల్​మీ నార్జో 70 ప్రో క్రేజీ ఫీచర్స్​లో ఒకటి.. దాని కెమెరా! ఇందులో సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ ఓఐఎస్ ఉంది. 1/1.56 ఇంచ్​తో వస్తున్న ఈ ఆకట్టుకునే 50 మెగాపిక్సెల్ సెన్సార్ సాధారణంగా టాప్-టైర్ స్మార్ట్​ఫోన్స్​, కొన్ని పాత ఫ్లాగ్షిప్ మోడళ్లలోనే కనిపిస్తుంది. అధునాతన కెమెరాతో పాటు, ఈ రియల్​మీ నార్జో 70 ప్రోలో ఎయిర్ జెస్చర్ సపోర్ట్​ని ఇంటిగ్రేట్ చేసింది. ఇది వినియోగదారులను దూరం నుంచే సైన్స్​ ద్వారా ఫోన్ ఇంటర్​ఫేస్​ని నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఎయిర్ జెస్చర్స్.. 10 కి పైగా విభిన్న హావభావాలను కలిగి ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. సాంప్రదాయ టచ్ ఇన్​పుట్​కి మించి సహజ నియంత్రణలను అందిస్తాయి. ముఖ్యంగా, ఈ సైన్స్​ రియల్​మీ ఇంటర్ఫేస్​కు మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ యాప్లకు కూడా విస్తరిస్తాయని, వివిధ రకాల అప్లికేషన్లలో వినియోగాన్ని పెంచుతాయని 91మొబైల్స్ నివేదించింది.

రియల్​మీ నార్జో 70 ప్రో డిజైన్.. హోల్-పంచ్ డిస్​ప్లేని కలిగి ఉంటుంది. ఇది ఆధునిక సౌందర్యం కోసం ఫ్లాట్ స్క్రీన్, స్లిమ్ బెజెల్స్ కలిగి ఉంటుంది. కుడి అంచులో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. వెనుక భాగంలో.. రియల్​మీ నార్జో 60 ప్రోను గుర్తుచేసే వృత్తాకార కెమెరా డిజైన్​ లభిస్తోంది.

Realme latest smartphone in India : 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్​ఫోన్​గా లాంచ్ కానున్న నార్జో 70 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్, ఎల్ఈడీ ప్లాష్​ కలిగి ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్​సెట్​తో ఈ ఫోన్ పనిచేస్తుందని, ప్రీ-ఇన్​స్టాల్​ చేసిన యాప్స్ తక్కువ సంఖ్యలో క్రమబద్ధమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుందని రూమర్స్​ సూచిస్తున్నాయి. నార్జో 70 ప్రో స్మార్ట్​పోన్​ ఇండియాలో అమెజాన్​లో అందుబాటులో ఉండనుంది.

ఈ నార్జో 70 ప్రో.. రియల్​మీ 12 ప్లస్ 5జీకి రీబ్రాండెడ్ వెర్షెన్ అని టాక్​ నడుస్తోంది. ఈ విషయంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో అధికారిక లాంచ్ తర్వాత మాత్రమే ఖచ్చితమైన వివరాలు వెల్లడవుతాయి.

Realme Narzo 70 Pro India launch : అయితే.. ఈ రియల్​మీ నార్జో 70 ప్రో ఈ నెలలో ఇండియాలో లాంచ్​ అవుతుందని సంస్థ చెప్పినప్పటికీ.. లాంచ్​ డేట్​ని ఇంకా ప్రకటించలేదు. ఫీచర్స్​, ధర వివరాలపైనా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై స్పష్టత వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

మరి.. ఇండియాలో ఈ రియల్​మీ నార్జో 70 ప్రో ఏ మేరకు ప్రదర్శన చేస్తుందో చూడాలి. దీనికి ప్రైజ్​ పాయింట్​ చాలా కీలకంగా మారనుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం