Realme 12+ 5G : రియల్మీ 12 ప్లస్ 5జీ.. ఇండియా లాంచ్‌కు రెడీ- ఫీచర్స్ ఇవే!
Realme 12+ 5G India launch : రియల్మీ 12 ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతుంది. ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది.
Realme 12+ 5G launch : సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది రియల్మీ సంస్థ. ఈ గ్యాడ్జెట్ పేరు రియల్మీ 12 ప్లస్ 5జీ. ఇందుకు సంబంధించి.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది సంస్థ. 'అల్టిమేట్ వాల్యూ మిడ్- రేంజ్ గ్యాడ్జెట్ వస్తోంది,' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ రియల్మీ 12 ప్లస్ ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలు.. రియల్మీ ఇండియా వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..
రియల్మీ 12 ప్లస్ 5జీ ఫీచర్స్..
రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో లెథర్ టెక్స్చర్తో కూడిన బ్యాక్ పానెల్ ఉంటుంది. దీనితో.. గ్యాడ్జెట్‌కి లగ్జరీ డిజైన్ ఫీల్ వస్తుంది. అయితే.. డిజైన్ ప్రకారం.. ఈ మొబైల్.. రియల్మీ 12 ప్రోని పోలి ఉండే అవకాశం ఉంది.
లీక్ అయిన డేటా ప్రకారం.. రియల్మీ 12 ప్లస్ 5జీలో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్ రేరే కెమెరా సెటప్ దీని సొంతం.
ఇక ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి లభిస్తుంది.
Realme 12+ 5G price in India : ఈ మొబైల్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటితో పాటు లాంచ్ డేట్‌ని సంస్థ త్వరలోనే రివీల్ చేస్తుందని సమాచారం.
ఇప్పటివరకు బయటకి వచ్చినా ఫీచర్స్‌ని చూస్తుంటే.. రియల్మీ 12 ప్లస్ మిడ్ రేంజ్ గ్యాడ్జెట్ అని స్పష్టమవుతుంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొంది. అందుకే.. రియల్మీ 12 ప్లస్ ప్రైజింగ్ చాలా కీలకంగా మారుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. సరసమైన ధరలో.. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం, ఈ గ్యాడ్జెట్‌కి మంచి డిమాండ్ కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
రియల్మీ 12 ప్రో సిరీస్..
Realme 12 pro price in India : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సిరీస్‌ని ఇటీవలే లాంచ్ చేసింది రియల్మీ సంస్థ. దీని పేరు రియల్మీ 12 ప్రో. ఇందులో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి.. రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో ప్లస్.
రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌లో కర్వ్డ్ డిస్ప్లే, టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ వంటివి కనిపిస్తున్నాయి. పవర్ బటన్, వాల్యూ బటన్ రైట్ సైడ్‌లో ఉంది. టైప్-సీ పోర్ట్, సిమ్ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ వంటివి.. కింది భాగంలో ఉన్నాయి. రేర్‌లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ వస్తోంది.
ఈ రియల్మీ 12 ప్రో, ప్రో+ గ్యాడ్జెట్స్‌లో 6.7 ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే లభిస్తోంది. రియల్మీ 12 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 32ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 12 ప్రో+ లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా రేర్‌లో వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం