RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?-ipl 2024 csk vs rcb match weather prediction and playoffs scenario ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Csk : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

Sharath Chitturi HT Telugu
May 18, 2024 06:30 AM IST

CSK vs RCB match weather : ఐపీఎల్​ 2024లో శనివారం ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మ్యాచ్​కి వర్షం ముప్పు పొంచి ఉంది. మరి మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి? ఏ జట్టు ముందుకు వెళుతుంది?

సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​కి వర్షం ముప్పు..!
సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​కి వర్షం ముప్పు..! (PTI)

RCB vs CSK IPL 2024 : ఐపీఎల్ 2024​లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా.. శనివారం రాత్రి 7:30 నిమిషాలకు చెన్నై సూపర్​ కింగ్స్​తో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తలపడనుంది. సాధారణంగానే.. ఈ రెండు జట్లు పోటీపడుతుంటే.. ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది.. ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​ కోసం ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్​ అత్యంత కీలకం మారడంతో.. హైఓల్టేజ్​ యాక్షన్​ తప్పదని క్రికెట్​ లవర్స్​ భావిస్తున్నారు. అంత బాగానే ఉంది కానీ.. ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మ్యాచ్​కి వర్షం ముప్పు పొంచి ఉండటమే ఐపీఎల్​ ఫ్యాన్స్​ని ఆందోళనకు గురి చేస్తోంది. మరి.. వర్షం వల్ల మ్యాచ్​ జరగకపోతే? ఐపీఎల్​ 2024లో సీఎస్కే, ఆర్సీబీ ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే ఐపీఎల్​ 2024..

రుతురాజ్​ గైక్వాడ్​ కెప్టెన్సీలో సీఎస్కే ఇప్పటివరకు 13 మ్యాచ్​లు ఆడి.. 7 గెలిచి, 6 ఓడిపోయింది. పాయింట్లు 14. ఇక ఫాఫ్​ డూప్లెసిస్​ నేతృత్వంలోని ఆర్సీబీ.. 6 విజయాలు, 7 పరాజయాలతో మొత్తం 12 పాయింట్స్​ సంపాదించుకుంది.

ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో సీఎస్కే 4, ఆర్సీబీ 7వ స్థానంలో ఉన్నాయి.

RCB vs CSK rain prediction : ఆర్సీబీతో పోల్చుకుంటే.. ప్రస్తుతం సీఎస్కేకే నెట్​ రన్​ రేట్​ కాస్త ఎక్కువగా ఉంది.

అయితే.. ఆర్సీబీకి ఈ మ్యాచ్​ చాలా కీలకం. ప్లేఆఫ్స్​ రేస్​లో ఉండాలంటే సీఎస్కేపై విజయం సాధించడమే కాదు.. భారీగా గెలవాలి. అప్పుడు విరాట్​ కోహ్లీ టీమ్​ నెట్​ రన్​ రేట్​ మెరుగుపడుతుంది.

ఒక వేళ మంచి మార్జిన్​తో ఆర్సీబీ గెలిస్తే.. జట్టుకు 14 పాయింట్లు వస్తాయి. సీఎస్కే, డీసీ, ఎల్​ఎస్​జీ సరసన కోహ్లీ టీమ్​ నిలుస్తుంది. కానీ నెట్​ రన్​ రేట్​ మెరుగుపడి.. ప్లేఆఫ్స్​ అవకాశాలు పుంజుకుంటాయి.

ఒక వేళ ఎంఎస్​ ధోనీ సీఎస్కే విజయం సాధిస్తే.. 16 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్స్​కి వెళుతుంది. ఒక వేళ సీఎస్కే ఓడిపోయినా.. ప్లేఆఫ్స్​ రేస్​లో ఉంటుంది. కానీ.. ఆర్సీబీ చేతులో ఘోరగా ఓడిపోకుండా ఉంటే చాలు! ఇక్కడ నెట్​ రన్​ రేట్​ కీలకంగా మారుతుంది.

కానీ వర్షం పడితే?

RCB vs CSK weather report : ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే జరిగే చిన్నస్వామి స్టేడియం ఉన్న బెంగళూరుకు శనివారం భారీ వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. ఒకవేళ మ్యాచ్​ జరగకపోతే.. రెండు జట్లకు చెరొక పాయింట్​ లభిస్తుంది. ఆ లెక్కన చూసుకున్నా.. సీఎస్కే మెరుగైన పరిస్థితిలోనే ఉంటుంది.

ఒక వేళ ఓవర్లు తగ్గించి ఆడితే మాత్రం ఆర్సీబీకి చాలా కష్టమవుతుంది! తక్కువ ఓవర్ల మ్యాచ్​లో నెట్​ రన్​ రేట్​ని మెరుగు పరిచే విధంగా గెలవాలంటే అద్భుతమై జరగాలి!

మరి పైన చెప్పిన వాటిల్లో ఏం జరుగుతుంది అనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది! ఫ్యాన్స్​ మాత్రం.. వర్షం పడకూడదని, రసవత్తర పోరును ఆశ్వాదించాలని భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం