CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..
MS Dhoni CSK : ఎంఎస్ ధోనీ బౌలింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే అస్త్రం అని నెటిజన్లు అంటున్నారు!
RCB vs CSK IPL 2024 : ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు ఈ వారం బ్లాక్ బస్టర్ ముగింపును చూడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్.. వర్చువల్ నాకౌట్ కానుంది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడంతో ఒకే ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఇక కీలకమైన ప్లేఆఫ్ స్థానం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. వీటి మధ్య.. సీఎస్కే విడుదల చేసిన ఓ వీడియో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. లెజెండరీ క్రికెటర్, డాషింగ్ వికెట్ కీపర్, ఫినీషర్ ఎంఎస్ ధోనీ ఉన్న ఆ వీడియోని చూస్తుంటే.. ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక ఆస్త్రాన్ని రూపొందిస్తోందని నెటిజెన్లు అంంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఎంఎస్ ధోనీ బౌలింగ్..
సీఎస్కే జట్టు స్టార్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ.. నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. ధోనీ బౌలింగ్ చేయడం చాలా అరుదు! నెట్స్‌లో కూడా.. బౌలింగ్ చేస్తూ కనిపించడం ఇంకా అరుదైన విషయం. మరి ఐపీఎల్ 2024లో.. సరిగ్గా ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్‌కి ముందు ధోనీ బౌలింగ్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
MS Dhoni bowling video : మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ ధోనీ ఈ ఈ ఐపీఎల్ 2024 సీజన్లో అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత సీజన్ ఈ టోర్నీలో ధోనీకి చివరిది వుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే, సీఎస్కే ప్లేఆఫ్స్‌కి చేరకపోతే.. ఆర్సీబీతో మ్యాచ్ ఐపీఎల్లో సీఎస్కే మాజీ కెప్టెన్‌కి చివరి మ్యాచ్ అవుతుంది! మరి రిటైర్మెంట్పై ఎంఎస్ ధోనీ ఇంకా స్పందించలేదు.
ధోనీ బౌలింగ్ వీడియోను ఇక్కడ చూడండి:
RCB vs CSK : నాలుగో స్థానంలో, ఆర్సీబీ కంటే రెండు పాయింట్లు ముందంజలో ఉన్నప్పటికీ.. ఫాఫ్ డుప్లెసిస్ సేనపై సూపర్ కింగ్స్ లైట్ తీసుకోదు. మరీ ముఖ్యంగా.. రాయల్ ఛాలెంజర్స్‌కు హోం అడ్వాంటేజ్ ఉంది. పైగా.. గత కొన్ని మ్యాచుల్లో విరాట్ కోహ్లీ టీమ్ ప్రదర్శన అద్భుతం! ఈ సీజన్ తొలి అర్ధభాగంలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓడిన ఆర్సీబీ.. అనూహ్యంగా పుంజుకుని ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో విజయ పరంపరను కొనసాగించింది.
ఆర్సీబీ కంటే సీఎస్కేకు నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది. అంటే 18 పరుగులు లేదా 18.1 ఓవర్లలో ఆర్సీబీ గెలవాలి (20 ఓవర్లలో 200 తొలి ఇన్నింగ్స్ స్కోరు అనుకుంటే). ఆటకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇది వాష్ అవుట్ అయితే, సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళుతుంది.
చెన్నైలో ఎంఎస్ ధోనీ మళ్లీ ఆడతాడా?
ఐపీఎల్ 2024లో చెన్నైలో అన్ని మ్యాచ్‌లు అయిపోయాయి. ఇక రెండో ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు ఉన్నయి. అయితే.. ప్లేఆఫ్స్‌కు సీఎస్కే బెర్త్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఒక వేళ.. సీఎస్కే ప్లేఆఫ్స్‌కి వెళితే.. చెన్నై ప్రజలు ధోనీని మళ్లీ చూసే ఛాన్స్ వస్తుంది.
ఈ సీజన్లో ధోనీ తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 13 మ్యాచుల్లో 226.67 స్ట్రైక్ రేట్‌తో 8 నాటౌట్లతో సహా 136 పరుగులు చేశాడు.
గత సీజన్లో అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచినప్పుడు ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు.
సంబంధిత కథనం