Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్-mr mrs mahi is a tribute to ms dhoni philosophy says janhvi kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2024 01:17 PM IST

Janhvi Kapoor - Mr Mrs Mahi: మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రం ఎంఎస్ ధోనీ ఫిలాసఫీకి గౌరవంగా ఉంటుందని జాన్వీ చెప్పారు.

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్
Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Janhvi Kapoor on MS Dhoni: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, హీరో రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ చిత్రం రూపొందింది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి గుంజన్ సక్సేనా ఫేమ్ డైరెక్టర్ శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 31వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడారు. భారత మాజీ దిగ్గజ కెప్టెన్, ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పే ఫిలాసఫీ తమ చిత్రంలో ఉంటుందని అన్నారు.

మ్యాచ్ ఫలితం గురించి కాకుండా తాను ప్రక్రియ (ప్రాసెస్)ను నమ్ముతానని, అది ముఖ్యమని ఎంఎస్ ధోనీ కొన్నిసార్లు చెప్పారు. ఈ సూత్రంతోనే టీమిండియాను విజయవంతంగా ముందుకు నడపటంతో పాటు చాలా మంది స్టార్ ప్లేయర్లుగా అయ్యేందుకు తోడ్పాడునందించారు ధోనీ. కాగా, ఎంఎస్ ధోనీ చెప్పే ఆ ఫిలాసఫీకి తమ చిత్రం గౌరవంగా ఉంటుందని జాన్వీ కపూర్ చెప్పారు.

ధోనీ చెప్పిన ఆ లైన్‍తోనే..

మహేంద్ర సింగ్ ధోనీ ఫిలాసఫీతోనే మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం రూపొందిందని జాన్వీ కపూర్ చెప్పారు. “ఆయన (ధోనీ) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫలితం గురించి కాకుండా ప్రాసెస్ గురించి ఆలోచించాలని చెప్పారు. నిజాయితీ, శ్రమతో మీరు ప్రాసెస్ పాటిస్తే ఫలితం కచ్చితంగా వస్తుందని, ఒకవేళ మీరు ఫెయిల్ అయినా అది పెద్ద విషయం కాదని ధోనీ అన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన ఆ లైన్‍పైనే ఈ సినిమా రూపొందింది. ఆయన ఫిలాసఫీని మేం గౌరవాన్ని అందిస్తున్నామని అనుకుంటున్నా” అని జాన్వీ కపూర్ చెప్పారు.

మహేంద్ర (రాజ్‍కుమార్ రావ్).. తన భార్య మహిమ (జాన్వీ కపూర్)లోని క్రికెట్ టాలెంట్‍ను గుర్తిస్తాడు. క్రికెట్‍లో కలలను నేరవేర్చుకునేందుకు ఆమెకు మహేంద్ర కోచింగ్ ఇవ్వడం చుట్టూ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం నడుస్తుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు గాయాలయ్యాయని జాన్వీ కపూర్ చెప్పారు.

చాలా గాయాలయ్యాయి

మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా షూటింగ్‍ కోసం క్రికెట్ ప్రిపేర్ అవుతుండగా తనకు చాలా గాయాలయ్యాయని జాన్వీ కపూర్ చెప్పారు. భుజం కీళ్లు కూడా జారాయని తెలిపారు. “నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా గాయాలు అయ్యాయి. నా రెండు భుజాలు కీళ్లు జారాయి. దర్శకుడు, నా ఇద్దరు కోచ్‍లు అభిషేక్ నాయర్, విక్రాంత్‍ చాలా కష్టపడి, నాకు నేర్పించారు” అని జాన్వీ చెప్పారు.

మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా కోసం కావాల్సిన క్రికెట్‍ను నేర్చుకునేందుకు తాను జాన్వీ చాలా శ్రమించారని, తమ టార్చర్‌ను ఆమె భరించారని దర్శకుడు శరణ్ శర్మ చెప్పారు. గతంలో జాన్వీ - శరణ్ కాంబినేషన్‍లో గుంజన్ సక్సేనా మూవీ తెరకెక్కి ప్రశంసలు దక్కించుకుంది.

మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రాన్ని జీ స్టూడియోస్‍తో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‍కుమార్ రావ్, జాన్వీతో పాటు రాజేశ్ శర్మ, కుముద్ మిశ్రా, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు చేశారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది.