MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!-mahendra singh dhoni fans feel free after csk vs rr match but new injury fear arise ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!

MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!

Chatakonda Krishna Prakash HT Telugu
May 12, 2024 09:51 PM IST

MS Dhoni - Chennai Super Kings: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ తర్వాత ఐపీఎల్‍కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రూమర్లు విపరీతంగా వచ్చాయి. అయితే, ఇప్పటికైతే అలాంటిదేమీ జరగపోవటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో ఆందోళన తలెత్తింది. ఆ వివరాలివే..

MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ!
MS Dhoni: ఊపిరి పీల్చుకున్న ధోనీ ఫ్యాన్స్.. కానీ! (PTI)

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ అలాగే ఆడుతున్నాడు. చెన్నైకు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోనీ ఈ సీజన్‍లో కెప్టెన్సీ వదిలేశాడు. రుతురాజ్ గైక్వాడ్‍కు కెప్టెన్సీ అందించిన ధోనీ.. దిశానిర్దేశం చేస్తున్నాడు. ఈ సీజనే ధోనీకి చివరిదనే అంచనాలు ఉన్నాయి. అయితే, రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నైలోని చెపాక్ వేదికగా నేటి (మే 12) మ్యాచ్ తర్వాత ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ అవుతాడనే రూమర్లు భారీగా వచ్చాయి. సీఎస్‍కే చేసిన ఓ ట్వీట్ దీనికి కారణమైంది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్‍పై ఎలాంటి ప్రకటన రాకపోవటంతో ధోనీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సీఎస్‍కే ఫ్రాంచైజీ ట్వీట్‍తో..

మ్యాచ్ పూర్తయ్యాక కూడా చెపాక్ స్టేడియంలో అభిమానులు వెళ్లిపోకుండా అలాగే ఉండాలని.. సమ్‍థింగ్ స్పెషల్ వస్తోందని మ్యాచ్‍కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. అభిమానులను రిక్వెస్ట్ చేసింది. దీంతో రాజస్థాన్‍తో మ్యాచ్ తర్వాత ధోనీ ఐపీఎల్‍కు గుడ్‍బై చెప్పనున్నాడంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఈ రూమర్లు తీవ్రంగా సాగాయి.

ఇదే జరిగింది

ఈ సీజన్‍లో హోం గ్రౌండ్‍ చెపాక్‍లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్‍లు ముగిశాయి. దీంతో మ్యాచ్ తర్వాత అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ధోనీ సహా చెన్నై ఆటగాళ్లు గ్రౌండ్ మొత్తం తిరిగారు. అలాగే, స్టాండ్స్‌లోని అభిమానులకు ధోనీ టెన్నిస్ బాల్స్ అందించారు. టెన్నిస్ బ్యాట్‍తో కొడుతూ బంతులను స్టాండ్స్‌లో అభిమానుల వద్దకు పంపారు. అలాగే, ఈ సీజన్‍లో చెపాక్‍లో చివరి లీగ్ మ్యాచ్ కావటంతో ఆటగాళ్లకు మెడల్స్ ప్రదానం చేసింది చెన్నై ఫ్రాంచైజీ.

చెపాక్‍లో ధోనీకి చివరిదా..?

ఈ సీజన్‍లో చెపాక్‍లో లీగ్ మ్యాచ్‍లు ముగిసినా.. ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ కూడా అదే స్టేడియంలో జరగనుంది. దీంతో ఈ సీజన్‍లో ఆ వేదికలో మరో రెండు మ్యాచ్‍లు జరగనున్నాయి. దీంతో సీఎస్‍కే ఒకవేళ ప్లేఆఫ్స్ చేరితే ధోనీ మరోసారి బరిలోకి దిగొచ్చు. చెపాక్‍లో ధోనీకి రాజస్థాన్‍తో మ్యాచే చివరిదా అని కామెంటరీలో ఉన్న ‘చిన్నతలా’ సురేశ్ రైనాకు ప్రశ్న ఎదురగా.. ఫేమస్ డైలాగ్ ‘డెఫనెట్లీ నాట్’ (కచ్చితంగా కాదు) అని సమాధానం చెప్పాడు. మరి.. చెన్నై ప్లేఆఫ్స్ వెళ్లి.. ధోనీ మళ్లీ తన డెన్ చెపాక్‍లో బరికి దిగుతాడేమో చూడాలి. ఒకవేళ ప్లేఆఫ్స్ చేరకపోతే చెపాక్‍లో ధోనీకి ఈ మ్యాచే చివరిది కావొచ్చు.

నడుముకు పట్టీతో ఆందోళన?

రాజస్థాన్‍తో మ్యాచ్‍లో చెన్నై స్టార్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‍కు రాలేదు. అయితే, డ్రెస్సింగ్‍లో నడుము పట్టీ పెట్టుకొని మహీ కనిపించాడు. దీంతో అతడికి నడుము గాయం కూడా అయిందా అనే ఆందోళన నెలకొంది. గత సీజన్‍లోనూ కాలిగాయంతో ఆడాడు ధోనీ. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు మళ్లీ నడుముకు పట్టీతో కనిపించటంతో ధోనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

గెలిచి.. ప్లేఆఫ్స్‌కు చెన్నై చేరువ

రాజస్థాన్ రాయల్స్‌తో నేడు (మే 12) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లతో తేడాతో అలవోకగా గెలిచింది. దీంతో ఈ సీజన్‍‍లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 7 గెలిచి.. ఆరు ఓడింది చెన్నై. 14 పాయింట్లతో పట్టికలో మూడో ప్లేస్ చేరింది. లీగ్ దశలో సీఎస్‍కేకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. మే 18న బెంగళూరుతో జరిగే మ్యాచ్‍లో గెలిస్తే.. చెన్నైకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆ మ్యాచ్ జరగనుంది.