MS Dhoni : సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​!-dhoni at chepauk for last time csk vs rr likely final chance for chennai fans ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni : సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​!

MS Dhoni : సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​!

Sharath Chitturi HT Telugu
May 12, 2024 04:01 PM IST

MS Dhoni latest news : ఆదివారం.. సీఎస్కే వర్సెస్​ ఆర్​ ఆర్​ పోరు​.. చెపాక్​లో ఎంఎస్​ ధోనీకి చివరి మ్యాచ్​ అవుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

చెపాక్​లో ధోనీ చివరి మ్యాచ్​ ఇవాళేనా?
చెపాక్​లో ధోనీ చివరి మ్యాచ్​ ఇవాళేనా? (AFP)

MS Dhoni latest news : మహేంద్ర సింగ్​ ధోనీ.. ఈ పేరంటే క్రికెట్​ అభిమానులకు ఒక ఎమోషన్​. ఐపీఎల్​ 2024ని చాలా మంది.. కేవలం ధోనీ కోసమే చూస్తున్నారు. వారందరికి.. తన బ్యాటింగ్​తో మరచిపోలేని జ్ఞాపకాలు ఇస్తున్నాడు ధోనీ. అయితే.. ఈ ఐపీఎల్​ 2024 లీగ్​ స్టేజ్​ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరుగుతున్న చెన్నై సూపర్​ కింగ్స్​- రాజస్థాన్​ రాయల్స్​ మ్యాచ్​.. చెపాక్​ స్టేడియంలో చివరిది! మరి చెపాక్​లో ధోనీకి కూడా ఇదే చివరి మ్యాచ్​ అవుతుందా?

ఐపీఎల్​ 2024- ధోనీకి చివరిదా?

ధోనీ ఇప్పుడు ఇంటర్నేషనల్​ క్రికెట్​ ఆడట్లేదు. కేవలం ఐపీఎల్​ ఆడుతున్నాడు. వాస్తవానికి ఐపీఎల్​ 2023లోనే మహేంద్రుడు రిటైర్​ అవుతాడని అందురు ఊహించారు. పైగా.. సీఎస్కే కప్​ సాధించడంతో, రూమర్స్​ మరింత పెరిగాయి. కానీ.. ఐపీఎల్​ 2024లో కూడా ధోనీ ఆడుతూ.. ఫ్యాన్స్​ని కనివిందు చేస్తున్నాడు.

CSK vs RR IPL 2024 : ఏది ఏమైనా.. ఐపీఎల్​ 2024లో కూడా ధోనీ రిటైర్మెంట్​ వ్యవహారంపై రూమర్స్​ జోరుగా సాగుతున్నాయి. ఇదే.. అతని చివరి ఐపీఎల్​ సీజన్​ అని చాలా మంది భావిస్తున్నారు. అందుకే.. ధోనీ ఎక్కడ మ్యాచ్​ ఆడినా, కేవలం అతడిని చూసేందుకే ప్రజలు భారీ సంఖ్యలో స్టేడియంలకు తరలి వెళుతున్నారు. ధోనీని ఒక్కసారైనా చూడాలని తాపత్రయపడుతున్నారు.

అయితే.. ఐపీఎల్​ 2024లోకి అడుగు పెడుతూనే.. సీఎస్కే కెప్టెన్సీని ధోనీ వదులుకున్నాడు. మరోవైపు.. రిటైర్మెంట్​ వార్తలపై లెజెండ్​ ఇంకా స్పందించకుండానే ఐపీఎల్​ 2024.. లీగ్​ స్టేజ్​ చివరి దశకు చేరుకుంది. సీఎస్కే జట్టు ఇంకా ప్లేఆఫ్స్​ బెర్త్​ ఖరారు చేసుకోలేదు.

ఈ నేపథ్యంలో.. చెపాక్​లో ఆదివారం జరుగుతున్న ఆర్​ఆర్​- సీఎస్కే మ్యాచ్​పై క్రికెట్​ అభిమానుల ఫోకస్​ పడింది. ఒక వేళ ధోనీ రిటైర్​ అయితే.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​ అవుతుంది. సీఎస్కే జట్టు ప్లేఆఫ్స్​కి చేరకపోతే.. ఇంకొన్ని రోజుల్లో ఆర్సీబీతో జరిగే మ్యాచ్​.. ధోనీకి చివరి ఐపీఎల్​ మ్యాచ్​ అవ్వొచ్చు!

సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​..

CSK vs RR MS Dhoni : ఇక ఆదివారం మధ్యాహ్నం జరుగుతున్న సీఎస్కే మ్యాచ్​ గురించి మాట్లాడుకుంటే.. రాజస్థాన్​ రాయల్స్​ జట్టు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. 5ఓవర్లకు వికెట్లేమీ కోల్పోకుండా 36 పరుగలు చేసింది.

ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​కి సీఎస్కే చేరుతుందా?

మూడు జట్లల్లో కాస్త సౌకర్యవంతమైన స్థితిలో ఉంది సీఎస్కేనే. డీసీ, ఆర్సీబీతో పోల్చుకుంటే.. నెట్​ రన్​ రేట్​ మెరుగ్గా ఉంది. ఆదివారం.. రాజస్థాన్​ రాయల్స్​తో సీఎస్కే తలపడనుంది. మే 18న.. ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తన చివరి లీగ్​ మ్యాచ్​ ఆడుతుంది.

CSK playoff chances 2024 : ఈ రెండు మ్యాచ్​లు గెలిస్తే.. సీఎస్కేకి గరిష్ఠంగా 16 పాయింట్లు వస్తాయి. ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​కి చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

రెండు మ్యాచ్​లలో ఒక్కటే గెలిచినా.. ధోనీ టీమ్​ ప్లేఆఫ్స్​కి వెళ్లాచు. కానీ.. డీసీ ఓడిపోవాలని సీఎస్కే ప్రార్థించాలి.

చెన్నై జట్టు రెండు మ్యాచ్​లు ఓడిపోతే మాత్రం.. టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోతుంది. 12 పాయింట్సే ఉంటాయి. ఎల్​ఎస్​జీ వర్సెస్​ డీసీలో గెలిచిన జట్టుకు 14 పాయింట్స్​ వస్తాయి.

డీసీ, ఆర్సీబీ ప్లేఆఫ్స్​ అవకాశలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం