IPL 2024 playoffs scenario : సీఎస్కే, డీసీ, ఆర్సీబీలో ప్లేఆఫ్స్‌కి వెళ్లే జట్టు ఏది?
IPL 2024 playoffs scenario : ఐపీఎల్ 2024లో సీఎస్కే, ఆర్సీబీ, డీసీల్లో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కి వెళుతుంది? ఆయా జట్ల పరిస్థితిని ఇక్కడ చూద్దాము..
IPL 2024 playoffs scenario : ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటోంది. దాదాపు 60 మ్యాచ్‌లు అయిపోయినా.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది ఒక్క కేకేఆర్ మాత్రమే! అదే సమయంలో.. రెండు జట్లు (ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్) టోర్నీ నుంచి వైదొలిగాయి. ఇక నాలుగో బెర్త్ కోసం రసవత్తరమైన పోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలను ఇక్కడ ఎనలైజ్ చేద్దాము..
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్..
చెన్నై సూపర్ కింగ్స్:- మూడు జట్లల్లో కాస్త సౌకర్యవంతమైన స్థితిలో ఉంది సీఎస్కేనే. డీసీ, ఆర్సీబీతో పోల్చుకుంటే.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఆదివారం.. రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్కే తలపడనుంది. మే 18న.. ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.
CSK playoff chances 2024 : ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. సీఎస్కేకి గరిష్ఠంగా 16 పాయింట్లు వస్తాయి. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచినా.. ధోనీ టీమ్ ప్లేఆఫ్స్‌కి వెళ్లాచు. కానీ.. డీసీ ఓడిపోవాలని సీఎస్కే ప్రార్థించాలి.
చెన్నై జట్టు రెండు మ్యాచ్‌లు ఓడిపోతే మాత్రం.. టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోతుంది. 12 పాయింట్సే ఉంటాయి. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీలో గెలిచిన జట్టుకు 14 పాయింట్స్ వస్తాయి.
దిల్లీ క్యాపిటల్స్:- ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో డీసీ ప్రస్తుతం 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.316. ఆర్సీబీ, ఎల్ఎస్జీతో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండు గెలిస్తే.. డీసీకి 16 పాయింట్లు వస్తాయి. ఆ రెండు గెలిచినా.. సీఎస్కే ఓడిపోవాలని డీసీ ప్రార్థించాలి. అప్పుడే డైరక్ట్‌గా ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అవుతుంది.
DC playoff chances 2024 : సీఎస్కేకి 16, డీసీకి 16 పాయింట్లు వస్తే.. నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతానికైతే.. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ మెరుగ్గా ఉంది.
డీసీ ఒక మ్యాచ్ గెలిచి 14 పాయింట్లతో నిలిసతే.. సీఎస్కే రెండు మ్యాచ్‌లు ఓడిపోవాలి. ఎల్ఎస్జీ ఒకటైనా ఓడిపోవాలి.
చివరిగా.. డీసీ రెండు మ్యాచ్‌లలో ఓడిపోతే.. ఇక టోర్నీ నుంచి వైదొలిగినట్టే!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:- ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ ఆశలు చాలా తక్కువగా ఉన్న జట్టు ఆర్సీబీ. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే.. 14 పాయింట్లు వస్తాయి. అయినా కూడా ప్లేఆఫ్స్‌కి చేరడం కష్టమే. మగిలిన జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆర్ఆర్పై సీఎస్కే ఓడిపోవాలి. ఎల్ఎస్జీపై డీసీ ఓడిపోవాలి. ఎంఐ చేతిలో ఎల్ఎస్జీ ఓడిపోవాలి. జీటీ.. తన చివరి మ్యాచ్‌లలో కనీసం ఒకటి ఓడిపోవాలి.
RCB playoff chances 2024 : ఇలా జరిగితే.. ఆర్సీబీ, ఎల్ఎస్జీ 14 పాయింట్లతో నిలుస్తాయి. లక్నోతో పోల్చుకుంటే.. ఆర్సీబీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం.. కాస్త ఉపశమనాన్ని ఇచ్చే విషయం.
సీఎస్కే రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ఎస్ఆర్హెచ్.. తన చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాలని ఆర్సీబీ ప్రార్థించాలి. కేకేఆర్ చేతిలో జీటీ ఓడిపోవాలి. ఎల్ఎస్జీ అన్ని మ్యాచ్‌లలో చేతులెత్తేయాలి.
పైన చెప్పినట్టు జరిగితే.. ఆరు జట్లకు 14 పాయింట్స్ ఉంటాయి. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు టీమ్స్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి వెళతాయి. ఆర్సీబీకి అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం