PBKS vs RCB: డకౌట్ కావాల్సిన వాడు సెంచరీకి చేరువగా.. కోహ్లి బాదుడుతో ఆర్సీబీ భారీ స్కోరు-ipl 2024 pbks vs rcb virat kohli rajat patidar fifties give royal challengers bengaluru huge total against punjab kings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pbks Vs Rcb: డకౌట్ కావాల్సిన వాడు సెంచరీకి చేరువగా.. కోహ్లి బాదుడుతో ఆర్సీబీ భారీ స్కోరు

PBKS vs RCB: డకౌట్ కావాల్సిన వాడు సెంచరీకి చేరువగా.. కోహ్లి బాదుడుతో ఆర్సీబీ భారీ స్కోరు

Hari Prasad S HT Telugu
May 09, 2024 09:53 PM IST

PBKS vs RCB: విరాట్ కోహ్లి, రజత్ పటీదార్ వీర బాదుడుతో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. కోహ్లి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

డకౌట్ కావాల్సిన వాడు సెంచరీకి చేరువగా.. కోహ్లి బాదుడుతో ఆర్సీబీ భారీ స్కోరు
డకౌట్ కావాల్సిన వాడు సెంచరీకి చేరువగా.. కోహ్లి బాదుడుతో ఆర్సీబీ భారీ స్కోరు (PTI)

PBKS vs RCB: డకౌట్ కావాల్సిన విరాట్ కోహ్లి, రజత్ పటీదార్ మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 రన్స్ చేసింది.

కోహ్లి 92 పరుగుల దగ్గర ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు రజత్ పటీదార్ కేవలం 23 బంతుల్లోనే 55 రన్స్ చేశాడు. కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46 పరుగులు) మెరుపులు, చివర్లో దినేష్ కార్తీక్ (7 బంతుల్లో 18) ఫినిషింగ్ టచ్ ఆర్సీబీకి భారీ స్కోరు అందించాయి.

డకౌట్ కావాల్సిన వాళ్లు..

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆ టీమ్ మొదట్లోనే డుప్లెస్సి (9), విల్ జాక్స్ (12) వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లి, తర్వాత వచ్చి రజత్ పటీదార్ కూడా డకౌట్లు కావాల్సిన వాళ్లే. అయితే పంజాబ్ ఫీల్డర్లు వీళ్లు ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేయడంతో ఇద్దరూ చెలరేగారు.

కోహ్లి సున్నా, 10 పరుగుల దగ్గర రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. మొదట పటీదార్ సున్నా పరుగుల దగ్గర ఔట్ నుంచి తప్పించుకొని చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ కేవలం 23 బంతుల్లోనే 55 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు, మూడు ఫోర్లు ఉన్నాయి. అతడు ఔటవగానే వర్షం కురిసింది.

కాసేపటి తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభం కాగానే కోహ్లి కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన స్ట్రైక్ రేట్ ను ప్రశ్నిస్తున్న వాళ్లకు ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ సమాధానం చెప్పాడు. ఫిఫ్టీ చేసిన ఊపులోనే సెంచరీ కూడా చేస్తాడనుకున్నా 92 పరుగుల దగ్గర ఔటయ్యాడు. అతడు కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్ లతో 92 రన్స్ చేయడం విశేషం.

హర్షల్‌కు పర్పుల్ క్యాప్

కోహ్లి, రజత్ లకు తోడు కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ మెరుపులతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. గ్రీన్ 27 బంతుల్లో 46 రన్స్ చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. అటు కార్తీక్ కేవలం 7 బంతుల్లో 2 సిక్స్ లు, ఒక ఫోర్ తో 18 రన్స్ చేశాడు. నిజానికి ఆర్సీబీ స్కోరు 250 పరుగులు టచ్ అవుతుందని భావించినా చివరి ఓవర్లో హర్షల్ పటేల్ చెలరేగిపోయాడు.

అతడు చివరి ఓవర్లో కేవలం మూడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోవడం విశేషం. దీంతో ఆర్సీబీ 241 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ ఇన్నింగ్స్ లోని మూడు వికెట్ల ద్వారా హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ తిరిగి పొందాడు. అతడు ఈ సీజన్లో 20 వికెట్లు తీసుకోవడం విశేషం. దీంతో 18 వికెట్లతో ఉన్న బుమ్రాను వెనక్కి నెట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

IPL_Entry_Point