RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..-heartbreaking end to ms dhonis ipl career fans urge csk mahi to not retire in 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Csk : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Sharath Chitturi HT Telugu
May 19, 2024 09:07 AM IST

MS Dhoni IPL 2024 : ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మ్యాచ్​లో చాలా భావాలు కనిపించాయి! ధోనీ కోపం, కోహ్లీ ఎమోషనల్​ మూమెంట్​.. ఇలా క్రికెట్​ అభిమానులకు ఈ మ్యాచ్​ గుర్తుండిపోతుంది. ఇక ధోనీ రిటైర్మెంట్​ రూమర్స్​ మధ్య.. ‘డెఫినెట్లీ నాట్​’ ట్రెండింగ్​లోకి వచ్చింది.

ఎంఎస్​ ధోనీ..
ఎంఎస్​ ధోనీ.. (AFP)

MS Dhoni retirement : ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మధ్య జరిగిన పవర్​ ప్యాక్డ్​ యాక్షన్​ని చూసి.. క్రికెట్​ అభిమానులు థ్రిల్​ అయ్యారు. ఒకానొక దశలో ఐపీఎల్​ 2024 పాయిట్స్​ టేబుల్​లో అట్టడుగున ఉన్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. ఇప్పుడు ప్లేఆఫ్స్​కి చేరడాన్ని అభినందిస్తున్నారు. అయితే.. క్రికెట్​ లవర్స్​లో ఇప్పుడు ఒక్కటే ఆవేదన! లెజెండరీ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. తన చివరి ఐపీఎల్​ మ్యాచ్​ ఆడేశాడా? అన్న ప్రశ్న అందరిని ఎమోషనల్​ చేస్తోంది. దీనికి ఇంకా సమాధానం దొరకలేదు కానీ.. ధోనీ రిటైర్​ అవ్వొద్దని చాలా మంది సోషల్​ మీడియాలో పోస్ట్​లు చేస్తున్నారు. పైగా.. ఓటమితో ఐపీఎల్​ కెరీర్​ని ముగించవొద్దని చెబుతున్నారు.

ధోనీ చివరి ఐపీఎల్​ మ్యాచ్​ ఇదేనా..?

శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే 191 రన్స్​ చేసి, 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. 42ఏళ్ల ధోనీ.. టీమ్​ కోసం తన వంతు కృషి చేశాడు. 13 బాల్స్​లో 3 ఫోర్లు, 1 సిక్స్​తో 25 పరగులు చేశాడు. 192.31 స్ట్రైక్​రేట్​. కానీ చివరి ఓవర్​లో ఔట్​ అయ్యాడు. అది.. ధోనీని కూడా ఫ్రస్ట్రేట్​ చేసింది. డగౌట్​కి వెళుతున్న సమయంలో చాలా కోపంగా కనిపించాడు ఎంఎస్​ ధోనీ. తన బ్యాట్​ని కోపంగా కొట్టాడు కూడా! మిస్టర్​ కూల్​ ఇలా చేయడం చాలా అరుదు. సీఎస్కేకి ఆ గెలుపు ఎంత ముఖ్యమో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక పోస్ట్​ మ్యాచ్​ హ్యాండ్​షేక్​ తర్వాత కూడా.. అసంతృప్తితో ధోనీ ఫీల్డ్​ని విడిచి వెళ్లిపోవడం కనిపించింది. ఇవన్నీ చూస్తున్న ధోనీ ఫ్యాన్స్​కి గుండె బద్ధలైపోయింది! పైగా.. ఇదే ధోనీ చివరి మ్యాచ్​ అవుతుందన్న ఆవేదన కూడా వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

RCB vs CSK match 2024 : ఎంఎస్​ ధోనీ ఇంటర్నేషనల్​ కెరీర్​ కూడా.. బాధతోనే ముగిసింది! 2019 వరల్డ్​ కప్​ సెమీఫైనల్స్​.. ధోనీకి చివరి ఇంటర్నేషనల్​ మ్యాచ్​. నాడు.. న్యూజిలాండ్​ చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. అప్పుడు కూడా ధోనీ ముఖంలో బాధ కనిపించింది. 2020 ఆగస్ట్​ 15.. ఇంటర్నేషనల్​ క్రికెట్​కి గుడ్​ బై చెబుతున్నట్టు ధోనీ ప్రకటించాడు.

ఇప్పుడు.. ఐపీఎల్​ 2024లో కూడా సీఎస్కే మాజీ సారథి ధోనీకి హార్ట్​-బ్రేక్​ తప్పలేదు. అందుకే.. ఇప్పుడే రిటైర్​ అవ్వొద్దని, ఇంకో సీజన్​ ఆడాలని అభిమానులు వేడుకుంటున్నారు.

"ఇది సరైన ఫేర్​వేర్​ కాదు.. ధోనీ ఇంకో సీజన్​ ఆడతాడని ఆశిస్తున్నాను," అని ఒక అభిమాని ట్వీట్​ చేశారు.

"ధోనీ.. ఇంకో సీజన్​ ఆడు ప్లీజ్​," అని మరొకరు అన్నారు.

MS Dhoni IPL 2024 : ఇంకొందరు.. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్​ మ్యాచ్​ అని ఫిక్స్​ అయిపోయి, అందుకు తగ్గట్టుగా ట్వీట్స్​ చేస్తున్నారు.

"పసుపు దుస్తుల్లో ధోనీ కొట్టిన చివరి 6 అది.." అని ఒకరు ట్వీట్​ చేశారు.

"థాంక్యూ ధోనీ.. ట్రోఫీలు, పరుగుల కన్నా ఫీల్డ్​లో నిన్ను చూడటమే చాలా ఎంజాయ్​ చేశాను. క్రికెట్​లో నిన్ను మిస్​ అవుతాను మహీ," అని మరొకరు పేర్కొన్నారు.

"బహుశా.. మహీ నుంచి ఇదే చివరి మ్యాచ్​! ఇన్ని జ్ఞాపకాలు ఇచ్చిన నీకు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మెగా ఆక్షన్​ ఉంది. మరి మహీ తిరిగొస్తాడని అనుకోవడం లేదు," అని ఇంకొకరు అన్నారు.

"42ఏళ్ల వయస్సులో.. కెరీర్​ చివరిలోనూ.. 'మహీ ఉంటే గెలిచేస్తాము' అన్న నమ్మకం కల్పించాడు," అని ఇంకొకరు రాసుకొచ్చారు.

IPL 2024 latest updates : వీటన్నింటి మధ్య.. 'డెఫినెట్లీ నాట్​ (కచ్చితంగా కాదు)' అన్న పదం.. ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోంది. 'ఇదే మీ చివరి సీజన్​ ఆ?' అని ఐపీఎల్​ 2023లో ధోనీని అడగ్గా.. 'డెఫినెట్లీ నాట్​' అని అతను జవాబి ఇవ్వడం మనకి గుర్తుంది. ఈసారి కూడా ధోనీ రిటైర్​ అవ్వొద్దని ఫ్యాన్స్​ అంటున్నారు.

ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషన్​..

ఇక ఐపీఎల్​ 2024 ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మ్యాచ్​లో చాలా భావాలు కనిపించాయి. జట్టును గెలిపించలేకపోయానని ఓవైపు ధోనీ కోపంగా ఉంటే.. ఆర్సీబీ గెలిచిందన్న ఆనందంలో విరాట్​ కోహ్లీ చాలా ఎమోషనల్​ అయ్యాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు కూడా కనిపించాయి. గ్రౌండ్​లో ఉండి ఆర్సీబీ సపోర్ట్​ చేసిన కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా.. సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంది.

Virat Kohli RCB : ఆర్సీబీకి ఇది నిజంగా ఒక మ్యాజికల్​ మూమెంట్​ అనే చెప్పుకోవాలి! ఒకానొక దశలో ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో బాటమ్​లో ఉన్న ఆ జట్టు.. వరుస విజయాలతో, ఏకంగా డిఫెండింగ్​ ఛాంపియన్​ సీఎస్కేని ఓడించి ప్లేఆఫ్స్​కి చేరింది. ఇదే ఆత్మవిశ్వాసాన్ని జట్టు కొనసాగిస్తే.. తొలి ఐపీఎల్​ ట్రోఫీ కల.. ఈసారి నెరవేరొచ్చు!

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం