Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన సన్‍రైజర్స్ స్టార్ అభిషేక్ శర్మ
- Abhishek Sharma Record: ఐపీఎల్ 2024 సీజన్‍లో అద్భుతమైన ఫామ్‍లో ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ రికార్డు సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని సిక్స్‌ల రికార్డులో అధిగమించాడు. ఆ రికార్డు వివరాలు ఇక్కడ చూడండి.
- Abhishek Sharma Record: ఐపీఎల్ 2024 సీజన్‍లో అద్భుతమైన ఫామ్‍లో ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ రికార్డు సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని సిక్స్‌ల రికార్డులో అధిగమించాడు. ఆ రికార్డు వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 6)
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు (మే 19) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ స్టార్ బ్యాటర్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. భారీ హిట్టింగ్‍తో సత్తాచాటాడు. (HT_PRINT)
(2 / 6)
ఈ మ్యాచ్‍లో అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదేశాడు. 66 పరుగులతో అద్భుతమైన అర్ధ శతకం చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ రికార్డు సృష్టించాడు. (ANI)
(3 / 6)
ఓ ఐపీఎల్ ఎడిషన్‍లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. పంజాబ్‍తో మ్యాచ్‍లో రిషీ ధావన్ బౌలింగ్‍లో సిక్స్ బాదిన తర్వాత ఈ ఘనత సాధించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అధిగమించి.. ఓ సీజన్‍లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. (PTI)
(4 / 6)
ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 41 సిక్స్‌లు బాదాడు. 2016 సీజన్‍లో విరాట్ కోహ్లీ 38 సిక్స్‌లు కొట్టాడు. అయితే, ఇప్పుడు దాన్ని దాటేసి ఓ ఐపీఎల్ ఎడిషన్‍లో అత్యధిక సిక్స్‌లు సాధించిన భారత ఆటగాడిగా రికార్డును అభిషేక్ సాధించాడు. (AFP)
(5 / 6)
ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 37 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్ శర్మ 41 బాదాడు. హైదరాబాద్, బెంగళూరు రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరాయి. మరి అభిషేక్‍ను సిక్స్‌ల విషయంలో విరాట్ మళ్లీ దాటతాడేమో చూడాలి. (PTI)
ఇతర గ్యాలరీలు