Virat Kohli IPL : ‘విరాట్ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!
RCB IPL 2024 : ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. కోహ్లీ ఆడినా జట్టు ఓడిపోతుందని, కానీ ఈసారి గెలవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
Virendra Sehwag on Virat Kohli : ఐపీఎల్ 2024లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్ల. ఆరేంజ్ క్యాప్ కోహ్లీకి దక్కడం దాదాపు ఖాయం! జట్టు ప్లేఆఫ్స్‌కి చేరడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో విరాట్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
"మ్యాచ్‌లో స్టార్టింగ్ చాలా కీలకం. అలాంటిది.. కీలకమైన సీఎస్కే మ్యాచ్‌లో ఆర్సీబీకి కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అతడి కన్నా ఫాఫ్ డూప్లెసిస్ ఎక్కువ రన్స్ చేసినా.. మూమెంటమ్ ఇచ్చింది కోహ్లీనే. నా వరకు కోహ్లీయే బెస్ట్ పర్ఫార్మర్. 162.07 స్ట్రైక్ రేట్‌తో 47 దగ్గర ఔట్ అయ్యాడు. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాను ఏం చేయగలడో అదే చేసి చూపించాడు," అని క్రిక్‌బజ్ ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చాడు సెహ్వాగ్.
"విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసిన చాలా సంతోషం కలిగింది. అతను రన్స్ చేసి గెలవడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సార్లు అతని జట్టు ఓడిపోతుంది. విరాట్ కోహ్లీ ఆడినా ఓడిపోతుంది. కానీ ఈసారి గెలిచింది. ఆర్సీబీ క్వాలిఫై అయ్యింది. ఆర్సీబీ సెలబ్రేషన్స్ రెట్టింపు అవుతాయి," అని టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి:- Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!
ఆర్సీబీ అద్భుతం..!
RCB IPL 2024 playoffs : ఇక ఐపీఎల్ 2024 ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో చాలా భావాలు కనిపించాయి. జట్టును గెలిపించలేకపోయానని ఓవైపు ధోనీ కోపంగా ఉంటే.. ఆర్సీబీ గెలిచిందన్న ఆనందంలో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు కూడా కనిపించాయి. గ్రౌండ్లో ఉండి ఆర్సీబీ సపోర్ట్ చేసిన కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా.. సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంది.
Virat Kohli RCB : ఆర్సీబీకి ఇది నిజంగా ఒక మ్యాజికల్ మూమెంట్ అనే చెప్పుకోవాలి! ఒకానొక దశలో ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో బాటమ్‌లో ఉన్న ఆ జట్టు.. వరుస విజయాలతో, ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేని ఓడించి ప్లేఆఫ్స్‌కి చేరింది. ఇదే ఆత్మవిశ్వాసాన్ని జట్టు కొనసాగిస్తే.. తొలి ఐపీఎల్ ట్రోఫీ కల.. ఈసారి నెరవేరొచ్చు! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం