తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Points Table: లీగ్ దశ ముగిసింది.. ఐపీఎల్ 2024 సీజన్ పాయింట్ల టేబుల్‍లో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?
- IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‍లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక ప్లేఆఫ్స్ జరగనున్నాయి. నాలుగు జట్లు ప్లేఆఫ్స్ చేరగా.. ఆరు ఎలిమినేట్ అయ్యాయి. ఈ సీజన్‍లో పాయింట్ల పట్టికలో ఏ జట్టు.. ఏ స్థానాన్ని దక్కించుకుందంటే..
- IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‍లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక ప్లేఆఫ్స్ జరగనున్నాయి. నాలుగు జట్లు ప్లేఆఫ్స్ చేరగా.. ఆరు ఎలిమినేట్ అయ్యాయి. ఈ సీజన్‍లో పాయింట్ల పట్టికలో ఏ జట్టు.. ఏ స్థానాన్ని దక్కించుకుందంటే..
(1 / 9)
ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. లీగ్ దశ మ్యాచ్‍లు ఆదివారం (మే 19) ముగిశాయి. పాయింట్ల పట్టికలో కోల్‍కతా టాప్ ప్లేస్‍ను దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, మూడు ఓడింది. రెండు మ్యాచ్‍లు రద్దయ్యాయి. 20 పాయింట్లు (1.428 నెట్ రన్‍రేట్) కేకేఆర్ ఖాతాలో ఉన్నాయి. దీంతో పాయింట్ల టేబుల్‍లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. (PTI)
(2 / 9)
సన్‍రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, ఐదు ఓడింది. ఓ మ్యాచ్ క్యాన్సల్ అయింది. 17 పాయింట్లను (0.414) కైవసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ దక్కించుకొని ప్లేఆఫ్స్ చేరింది. (AFP)
(3 / 9)
రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడగా.. ఓ మ్యాచ్ వాన వల్ల రద్దయింది. దీంతో 17 పాయింట్లను (0.273) పొందింది. అయితే, హైదరాబాద్ కంటే తక్కువ నెట్ రన్‍రేట్ ఉండటంతో మూడో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది రాజస్థాన్.(AFP)
(4 / 9)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‍లో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచి, ఏడు పరాజయం చెందింది బెంగళూరు. ఈ సీజన్ తొలి ఎనిమిది మ్యాచ్‍ల్లో ఏడు ఓడి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంది. అయితే, తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‍లు గెలిచి అద్భుతం చేసి.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. 14 పాయింట్లతో (0.459) పట్టికలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.(AFP)
(5 / 9)
ఇక, మిగిలిన ఆరు జట్లు ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించాయి. చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచి, ఏడు ఓడింది. 14 పాయింట్లతో (0.392) నిలిచింది. అయితే, బెంగళూరు కంటే తక్కువ నెట్ రన్‍రేట్ ఉండటంతో ఐదోస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. (AFP)
(6 / 9)
ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి, ఏడు గెలిచి 14 పాయింట్లను (-0.377) దక్కించుకుంది. పట్టికలో ఆరో ప్లేస్‍లో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచి, ఏడు ఓడింది. 14 పాయింట్లు (-0.667) ఉన్నా నెట్ రన్‍రేట్ తక్కువగా ఉండటంతో ఏడో ప్లేస్‍లో నిలిచి ఎలిమినేట్ అయింది. (LSG-X)
(7 / 9)
గుజరాత్ టైటాన్స్ 14 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, 7 ఓడగా.. 2 మ్యాచ్‍లు రద్దయ్యాయి. దీంతో 12 పాయింట్లతో (-1.063) ఎనిమిదో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, 9 ఓడి 10 పాయింట్ల (-0.353)తో సరిపెట్టుకుంది. తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. (PTI)
(8 / 9)
ఇక ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్‍లో అఖరిదైన పదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 14 మ్యాచ్‍ల్లో 4 మాత్రమే గెలిచి 10 ఓడింది హార్దిక్‍సేన. దీంతో 8 పాయింట్లను మాత్రమే దక్కించుకుంది. గుజరాత్, పంజాబ్, ముంబై ఈ సీజన్‍లో తీవ్రంగా నిరాశపరిచాయి. (AFP)
ఇతర గ్యాలరీలు