Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..-virat kohli child vamika to be a future cricket star rcb star says ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

Sharath Chitturi HT Telugu
May 17, 2024 01:34 PM IST

Virat Kohli RCB : తమ కూతురు వామిక.. బ్యాట్​ పట్టుకుందని, చాలా ఎంజాయ్​ చేస్తోందని చెప్పాడు విరాట్​ కోహ్లీ. మరి వామిక క్రికెటర్​ అవుతుందా? అన్న ప్రశ్నకు ఏం జవాబు ఇచ్చాడంటే..

విరాట్​ కోహ్లీ..
విరాట్​ కోహ్లీ.. (PTI)

Virat Kohli Vamika : టీమిండియా స్టార్​ ప్లేయర్​, ఆర్సీబీ డాషింగ్​ ఓపెనర్​ విరాట్​ కోహ్లీ.. తన కూతురు వామికకు సంబంధించిన ఒక ఆసక్తిర విషయాన్ని తాజాగా వెల్లడించాడు. వామిక క్రికెట్​ బ్యాట్​ పట్టుకుందని, చాలా ఎంజాయ్​ చేస్తోందని అన్నాడు. మరి వామిక క్రికెటర్​ అవుతుందా? అన్న ప్రశ్నకు కోహ్లీ ఏం జవాబు ఇచ్చాడంటే..

వామిక క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ ఏమన్నాడంటే..

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు క్యాంపైన్​లో ఫేమస్​ అయిన మిస్టర్​ నాగ్​ (దానిశ్​ సైట్​)తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు విరాట్​ కోహ్లీ. ఈ క్రమంలోనే వామికకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

"వామిక క్రికెట్​ బ్యాట్​ పట్టుకుంది. బ్యాట్​ని స్వింగ్​ చేయడాన్ని ఎంజాయ్​ చేస్తోంది," అని కోహ్లీ అన్నాడు.

కానీ.. ఏ కెరీర్​ ఎంచుకోవాలనేది వామిక ఇష్టమని అన్నాడు.

'బ్యాట్​ పట్టుకుంది కానీ.. నేను ఇప్పుడే ఏం చెప్పలేదు. పైగా ఏ కెరీర్​ ఎంచుకోవాలనేది పిల్లల ఇష్టం,' అని కోహ్లీ అన్నాడు.

IPL 2024 Virat Kohli : అనుష్క శర్మ- విరాట్​ కోహ్లీలకు ఫిబ్రవరి 15న మధ్య ఒక మగబిడ్డ పుట్టాడని, అతనికి అకాయ్​ అని పేరు పెట్టారని మనకి తెలుసు. తాజాగా.. అకాయ్​ మీద అప్డేట్​ ఇచ్చాడు విరాట్​.

"అకాయ్​ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతా బాగుంది. థాంక్యూ!" అని అన్నాడు.

ఐపీఎల్​ 2024- విరాట్​ కోహ్లీ..

ఇక ఐపీఎల్​ 2024 విషయానికొస్తే.. ఆరెంజ్​ క్యాప్​ రేస్​లో దూసుకెళుతున్నాడు కోహ్లీ. 13 ఇన్నింగ్స్​లలో 661 రన్స్​తో మొదటి స్థానంలో ఉన్నాడు. స్ట్రైక్​ రేట్​ 155.6. యావరేజ్​ 66.10. ఈ సీజన్​లో మొత్తం మీద 1 సెంచరీ, 5 హాఫ్​ సెంచరీలు చేశాడు విరాట్​ కోహ్లీ.

RCB vs CSK IPL 2024 : ఇక శనివారం సీఎస్కేతో జరగనున్న మ్యాచ్​.. ఆర్సీబీకి అత్యంత కిలకంగా మారనుంది. ప్రస్తుతం 13 మ్యాచ్​లు ఆడిన ఆ జట్టు 16 పాయింట్స్​తో 6వ స్థానంలో ఉంది. సీఎస్కేతో గెలవడమే కాదు.. మంచి మర్జిన్​తో గెలిచి, రన్​ రేట్​ని మెరుగుపరుచుకుంటే.. ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​ రేసులో ఆర్సీబీ నిలుస్తుంది. అయితే.. చిన్నస్వామి స్టేడియం ఉన్న బెంగళూరులో శనివారం వర్షం పడే అవకాశం ఉందన్న వార్తలు.. అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం