Kohli Anushka Son Name: కోహ్లి, అనుష్క కొడుకు పేరు అకాయ్.. దీనికి అర్థమేంటో తెలుసా?-kohli anushka son name akaay know the meaning of this cricket bollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kohli Anushka Son Name: కోహ్లి, అనుష్క కొడుకు పేరు అకాయ్.. దీనికి అర్థమేంటో తెలుసా?

Kohli Anushka Son Name: కోహ్లి, అనుష్క కొడుకు పేరు అకాయ్.. దీనికి అర్థమేంటో తెలుసా?

Hari Prasad S HT Telugu

Kohli Anushka Son Name: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఫిబ్రవరి 15న కొడుకు పుట్టిన విషయం తెలుసు కదా. అతనికి అకాయ్ అనే పేరు పెట్టారు. మరి దీనికి అర్థమేంటి?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కొడుకు పేరు అకాయ్.. అసలు దీనికి అర్థమేంటి?

Kohli Anushka Son Name: విరాట్ కోహ్లి టీమిండియాకు ఎందుకు దూరమయ్యాడన్న సస్పెన్స్ కు తెరదించుతూ.. తాము రెండోసారి తల్లిదండ్రులమయ్యామన్న విషయాన్ని కోహ్లి, అనుష్క దంపతులు వెల్లడించిన సంగతి తెలుసు కదా. ఫిబ్రవరి 15నే వీళ్లకు బాబు పుట్టినా.. ఐదు రోజుల తర్వాత మంగళవారం (ఫిబ్రవరి 20) వీళ్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు తమ బాబుకు అకాయ్ అనే పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు.

అసలు అకాయ్ అంటే అర్థమేంటి?

కోహ్లి, అనుష్క తమ కొడుకుకు అకాయ్ అనే పేరు పెట్టారన్న విషయం తెలియగానే అసలు ఈ పేరుకు అర్థమేంటో తెలుసుకోవడానికి చాలా మంది ఇంటర్నెట్ లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో తమకు కూతురు పుట్టినప్పుడు కూడా ఈ జంట వామికా అనే ఓ డిఫరెంట్ పేరు పెట్టారు. ఇప్పుడు బాబుకు అకాయ్ అనే చాలా అరుదైన పేరు పెట్టడంతో దాని అర్థమేంటన్నది వెతుకుతున్నారు.

అకాయ్ అనేది సంస్కృత పదం. దీనికి అర్థం చిరంజీవుడు అని. గతంలో కూతురుకు వామికా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దానికి అర్థమేంటో కోహ్లి, అనుష్కనే వెల్లడించారు. దుర్గామాతకు ఉన్న పేర్లలో వామికా కూడా ఒకటని వాళ్లు చెప్పారు. అంతేకాదు అందులో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఇంగ్లిష్ అక్షరాలు కలిసి వచ్చేలా కూడా వాళ్లు ఆ పేరు పెట్టారు.

అనుష్క అనౌన్స్‌మెంట్

ప్రస్తుతం ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుండగా వ్యక్తిగత కారణాలంటూ కోహ్లి మొత్తం సిరీస్ కు అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యం కలిగించింది. అసలు దీనికి కారణమేంటో తెలియక చాలా మంది అయోమయానికి గురయ్యారు. ఆ మధ్య కోహ్లి ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్.. విరాట్ రెండోసారి తండ్రి కాబోతున్నాడని మొదట చెప్పి.. తర్వాత అది నిజం కాదని అనడంతో మరింత గందరగోళం నెలకొంది.

మొత్తానికి ఈ సస్పెన్స్ కు తెరదించుతూ కోహ్లి దంపతులు తమకు రెండో సంతానం కలిగిందని మంగళవారం (ఫిబ్రవరి 20) ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. అయితే కొడుకు పుట్టిన ఐదు రోజుల తర్వాత అనౌన్స్ చేయడమే ఆశ్చర్యం కలిగించింది. "ఫిబ్రవరి 15న మేము మా రెండో సంతానం అకాయ్ కు వెల్‌కమ్ చెప్పామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించండి" అని ఆ ప్రకటనలో కోహ్లి దంపతులు కోరారు.

కోహ్లి, అనుష్కకు మరో సంతానం

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు జనవరి 11, 2021న కూతురు పుట్టింది. ఇక చాలా రోజులుగా అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తూనే ఉన్నా.. ఈ దంపతులు ఎప్పుడూ బయటకు చెప్పలేదు. చివరికి ఇంగ్లండ్ తో కీలకమైన సిరీస్ కు కోహ్లి మొత్తం దూరమవడానికి కారణం ఇదే అన్న విషయాన్ని కూడా దాచి పెట్టారు.

మొదట రెండు టెస్టులకు మాత్రమే కోహ్లి దూరంగా ఉంటాడని అన్నారు. ఆ తర్వాత సిరీస్ మొత్తానికీ అని చెప్పారు. అసలు కారణంగా చెప్పకుండా కోహ్లి ఇలా ఇన్నాళ్లపాటు జట్టుకు దూరంగా ఉండటమేంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి కోహ్లి రెండోసారి తండ్రయ్యాడన్న వార్తతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.