Rohit Sharma Sixes Record: రోహిత్ శర్మ మరో సిక్స్‌ల రికార్డు.. ఈసారి డివిలియర్స్‌ను వెనక్కి నెట్టి..-rohit sharma sixes record in a calendar year breaks ab de villiers record ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Sixes Record: రోహిత్ శర్మ మరో సిక్స్‌ల రికార్డు.. ఈసారి డివిలియర్స్‌ను వెనక్కి నెట్టి..

Rohit Sharma Sixes Record: రోహిత్ శర్మ మరో సిక్స్‌ల రికార్డు.. ఈసారి డివిలియర్స్‌ను వెనక్కి నెట్టి..

Hari Prasad S HT Telugu

Rohit Sharma Sixes Record: రోహిత్ శర్మ మరో సిక్స్‌ల రికార్డు క్రియేట్ చేశాడు. ఈసారి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కి నెట్టి.. ఒకే కేలండర ఏడాదిలో అత్యధిక సిక్స్ లు కొట్టిన రికార్డు సొంతం చేసుకున్నాడు.

రోహిత్ శర్మ 2023లో వన్డేల్లో 59 సిక్స్ లు బాదాడు (PTI)

Rohit Sharma Sixes Record: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్స్ ల రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అతడు మరో సిక్స్ ల రికార్డును క్రియేట్ చేశాడు. ఈసారి ఒకే కేలండర్ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ రికార్డును రోహిత్ సొంతం చేసుకున్నాడు. ఇన్నాళ్లూ ఈ రికార్డు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది.

రోహిత్ శర్మ నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో తన రెండో సిక్స్ కొట్టినప్పుడు రికార్డు క్రియేట్ చేశాడు. 2023లో వన్డే క్రికెట్ లో రోహిత్ కొట్టిన 59వ సిక్స్ ఇది. ఈ క్రమంలో 58 సిక్స్ ల డివిలియర్స్ రికార్డు మరుగన పడిపోయింది. హిట్ మ్యాన్ గా పేరుగాంచిన రోహిత్.. సిక్స్ లు బాదడంలో దిట్ట. ఈ క్రమంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్ ల రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

అది కూడా వరల్డ్ కప్ లోనే క్రిస్ గేల్ రికార్డును తిరగరాసాడు. ఇక తాజాగా ఒకే కేలండర్ ఏడాదిలో వన్డే క్రికెట్ లో 59వ సిక్స్ తో రోహిత్ మరో రికార్డును క్రియేట్ చేయడం విశేషం. ఏడో ఓవర్లో అకెర్‌మాన్ వేసిన బంతిని లాంగాన్ దిశగా సిక్స్ కొట్టాడు రోహిత్. 2015లో ఏబీ డివిలియర్స్ 18 వన్డే ఇన్నింగ్స్ లోనే 58 సిక్స్ లు కొట్టాడు.

ఎనిమిదేళ్లుగా ఏబీ రికార్డు అలాగే ఉంది. ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉన్న రోహిత్ దానిని బ్రేక్ చేశాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత క్రిస్ గేల్ 2019లో 15 ఇన్నింగ్స్ లో 56 సిక్స్ లు, షాహిద్ అఫ్రిది 2002లో 36 ఇన్సింగ్స్ లో 48 సిక్స్ లు బాదారు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో రోహిత్ 54 బంతుల్లో 61 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో గిల్ తో కలిసి తొలి వికెట్ కు 100 రన్స్ జోడించాడు రోహిత్. ఈ ఇద్దరు ఓపెనర్ల జోరుతో టీమిండియాకు మంచి స్టార్ట్ లభించింది. అయితే గిల్ కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే 51 రన్స్ దగ్గర ఔటయ్యాడు.