(1 / 7)
Warner World Record: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియాతో మ్యాచ్ లో ఓ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 46 రన్స్ చేసిన వార్నర్.. వరల్డ్ కప్ లలో 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ రికార్డులను బ్రేక్ చేశాడు.
(2 / 7)
Warner World Record: వరల్డ్ కప్ లలో సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్ లో 1000 రన్స్ చేశారు. అయితే డేవిడ్ వార్నర్ మాత్రం తన 19వ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు.
(AP)(3 / 7)
Warner World Record: వన్డే వరల్డ్ కప్ లలో అత్యధిక పరుగుల రికార్డు ఉన్న సచిన్ టెండూల్కర్ ఇంతకుముందు అత్యంత వేగంగా అంటే 20 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు చేశాడు.
(4 / 7)
Warner World Record: సచిన్ తర్వాత సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా 20 ఇన్నింగ్స్ లోనే వరల్డ్ కప్ లలో 1000 రన్స్ పూర్తి చేశాడు.
(5 / 7)
Warner World Record: ఇక సచిన్, డివిలియర్స్ తర్వాతి స్థానంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అతడు 21 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ లో 1000 రన్స్ చేశాడు.
(6 / 7)
Warner World Record: వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ వివ్ రిచర్డ్స్ కూడా 21 ఇన్నింగ్స్ లోనే వరల్డ్ కప్ లలో 1000 పరుగులు చేయడం విశేషం.
(7 / 7)
Warner World Record: సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హర్ష్‌లీ గిబ్స్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్ వా 22 ఇన్నింగ్స్ లో 1000 రన్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు