Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్
Rohit Sharma - Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ తన చివరి మ్యాచ్ ఆడేశాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో లక్నోతో మ్యాచ్ తర్వాత రోహిత్‍తో జట్టు ఓనర్ నీతా అంబానీ మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Rohit Sharma - Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై.. ఈసారి ప్లేఆఫ్స్ చేరకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 14 మ్యాచ్‍ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. సారథిగా ముంబైను ఐదుసార్లు ఛాంపియన్‍గా నిలిపిన రోహిత్ శర్మను ఈ సీజన్‍లో కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను ఆస్థానంలో నియమించింది టీమ్ మేనేజ్‍మెంట్. పాండ్యా సారథ్యంలో ఈ సీజన్‍లో ముంబై దారుణ ప్రదర్శన చేసింది. హార్దిక్ కెప్టెన్సీపై ముంబై జట్టులోని ఆటగాళ్లు కూడా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం బయటికి వచ్చింది.
రోహిత్ శర్మను కెప్టెన్‍గా తొలగించి హార్దిక్ పాండ్యాను ఆ స్థానంలో నియమించడంపై చాలా మంది మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యాను బూ అంటూ స్టేడియాల్లో ఫ్యాన్స్ షాకిచ్చారు. అయితే, ఈ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్‌ను వీడి వేరే ఫ్రాంచైజీకి వెళతాడని సమాచారం బయటికి వచ్చింది. ఈ సీజన్‍లో తన చివరి లీగ్ మ్యాచ్‍లో ముంబై.. లక్నో చేతిలో శుక్రవారం (మే 18) పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మతో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ గ్రౌండ్‍లోనే మాట్లాడారు.
వీడియో వైరల్
ముంబై హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో లక్నోతో ముంబై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత మైదానంలోనే రోహిత్ శర్మతో నీతా అంబానీ చర్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ థియరీలు చెబుతున్నారు.
ఆ విషయమే అడిగారు!
రోహిత్ శర్మతో నీతా అంబానీ చర్చించిన వీడియోపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుతోనే కొనసాగాలనే విషయంపై రోహిత్ శర్మతో నీతా మాట్లాడారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చాలా మంది ఇదే విధంగా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‍ను ముంబైతోనే ఉండాలని నీతా అడిగారనే థియరీలు చెబుతున్నారు. కొందరేమో హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడారని కూడా రాసుకొస్తున్నారు. మొత్తంగా రోహిత్‍తో నీతా అంబానీ మాట్లాడిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ముంబైకు రోహిత్ గుడ్‍బై చెప్పనున్నాడా?
ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరుపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడని కూడా కొన్ని రిపోర్టులు వచ్చాయి. దీంతో హిట్‍మ్యాన్ వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వచ్చి వేలంలోకి వస్తాడనే అంచనాలు ఉన్నాయి. వేరే జట్టుకు వెళ్లాలని కూడా రోహిత్ ఆలోచనలో ఉన్నట్టు రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
రోహిత్ శర్మకు ముంబై తరఫున ఇదే చివరి మ్యాచ్ అన్నట్టు లక్నోతో పోరులో అతడు ఔటయ్యాక అభిమానులు స్టాండిగ్ ఓవేషన్ ఇచ్చారు. నిలబడి చప్పట్ల మోత మెగించారు.
ఈ సీజన్‍లో తన చివరి మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ జట్టు.. లక్నో చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 215 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ (38 బంతుల్లో 68 పరుగులు) అద్భుత అర్ధ శకతం చేసినా ఫలితం లేకపోయింది. నమన్ ధీర్ ( 28 బంతుల్లో 62 పరుగులు నాటౌట్) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ముంబై ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులే చేయగలిగింది ముంబై. అంతకు ముందు తొలుత బ్యాటింగ్‍లో లక్నో 6 వికెట్లకు 214 రన్స్ చేసింది.