OnePlus 12R : వన్‌ప్లస్ 12ఆర్ కొత్త వేరియంట్ లాంచ్.. ఇక స్టోరేజ్ కష్టాలు దూరం!
OnePlus 12R new variant : వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయ్యింది. ఇక స్టోరేజ్ కష్టాలు దూరమవుతాయి! ఈ కొత్త వేరియంట్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..
OnePlus 12R price in India : ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఫోకస్ చేసిన వన్ ప్లస్ సంస్థ.. తాజాగా, తన బెస్ట్ సెల్లింగ్ మోడల్లో కొత్త వేరియంట్‌ని లాంచ్ చేసింది. అది.. వన్‌ప్లస్ 12 8జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఈ మోడల్లో ఇప్పటికే.. 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్ విశేషాలను ఇక్కడ చూసేయండి..
వన్ ప్లస్ 12ఆర్ ధర, ఆఫర్లు..
వన్ ప్లస్ 12ఆర్ 8జీబీ/256జీబీ వేరియంట్ ధర ధర రూ.42,999గా ఉంది. కాంపిటీటివ్ ప్రైజ్‌లో మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను అందిస్తోంది వన్ ప్లస్. సంస్థ అధికారిక వెబ్సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ ఔట్‌లెట్స్‌తో సహా ఇతర స్మార్ట్‌ఫోన్ స్టోర్స్ ద్వారా ఈ కొత్త వేరియంట్‌ని కొనుగోలు చేసుకోవచ్చు.
OnePlus 12R price : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌పై పలు అట్రాక్టివ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, వన్ కార్డ్ కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, పాత డివైస్లపై రూ.3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి లభిస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అయ్యే యూజర్లకు.. అదనంగా రూ.1,000 బోనస్ లభిస్తుండటం విశేషం. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు రూ.4,999 విలువైన వన్‌ప్లస్ బడ్స్ జెడ్2ను ఉచితంగా పొందుతార! ప్రముఖ బ్రాండ్ల ద్వారా 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందొచ్చు. అంతేకాదు.. నెలకు రూ. 150 తగ్గింపుతో 15 నెలల పాటు జియో నుంచి బెనిఫిట్స్ పొందొచ్చు.
ఇదీ చూడండి:- Realme Narzo 70 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ ను టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు; సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా కూడా ఉంది
వన్ ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్లు..
వన్ ప్లస్ 12ఆర్ 8జీబీ/256జీబీ వేరియంట్ అద్భుతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్‌ను అందిస్తుంది. ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది ఈ స్మార్ట్‌ఫోన్. 6.78 ఇంచ్ ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లేతో, వినియోగదారులు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వైబ్రెంట్ విజువల్స్‌ని ఆస్వాదించవచ్చు. స్మూత్ స్క్రోలింగ్- అంతరాయం లేని మల్టీమీడియా ప్లేబ్యాక్స్ని ఆస్వాదిస్తారు.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, అడ్రినో జీపీయూతో జత చేసిన ఈ ఫోన్ సమర్థవంతమైన పనితీరు, గ్రాఫిక్స్ రెండరింగ్ కోసం పనిచేస్తుంది.
OnePlus 12R new variant price : ఇక స్టోరేజ్ విషయానికొస్తే.. ఈ పరికరం 256 జీబీ యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో తగినంత స్పేస్ అందిస్తుంది. ఇది వినియోగదారులకు ఇష్టమైన గేమ్స్, ఫోటోలు, వీడియోలను సులభంగా స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.0 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్.. వినియోగదారులకు స్మూత్ అండ్ ఇంట్యూటివ్ సాఫ్ట్వేర్ అనుభవాన్ని అందిస్తుంది.
సంబంధిత కథనం