Realme Narzo 70 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ ను టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు; సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా కూడా ఉంది
Realme Narzo 70 Pro 5G: భారత్ లో రియల్ మీ నార్జో 70 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ మార్చి 19న లాంచ్ అయింది. ఇందులో అత్యంత అడ్వాన్స్డ్ సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ (Sony IMX890 OIS) కెమెరా ను పొందుపర్చారు. ఇది స్వైప్ (Swipe), పాయింట్ (Point), గో (Go) వంటి ఎయిర్ గెస్చర్ల (Air Gestures) ను సపోర్ట్ చేస్తుంది.
కొన్ని వారాల నిరీక్షణ తర్వాత రియల్ మి తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మి నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) ని భారత్ లో లాంచ్ చేసింది. కంపెనీ దీనిని "మోస్ట్ ప్రీమియం నార్జో" స్మార్ట్ ఫోన్ గా పేర్కొంది. కొత్త రియల్మీ నార్జో 70 ప్రో 5 జి యొక్క అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా. ఇది ఇండియాలో ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిదని రియల్ మి పేర్కొంది. ఈ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వివరాలు మీ కోసం..
రియల్మీ నార్జో 70 ప్రో 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
రియల్ మి నార్జో 70 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డిఆర్ 10+ సర్టిఫికేషన్ తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ ప్యానెల్ 100% పీ 3 కలర్ గామట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కు సపోర్ట్ చేస్తుంది.రియల్ మి నార్జో 70 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ లో 16 జీబీ ర్యామ్ (8 జీబీ ర్యామ్ +8 జీబీ వర్చువల్ ర్యామ్), 256 జీబీ వరకు స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ని అమర్చారు.
సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా
రియల్ మి నార్జో 70 ప్రో 5 జీ (Realme Narzo 70 Pro 5G) స్మార్ట్ ఫోన్ వెనకవైపు సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ (Sony IMX890 OIS) కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిదని కంపెనీ పేర్కొంది. ఇది మాస్టర్ షాట్ అల్గారిథమ్ వంటి ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇమేజ్ నాణ్యతలో తిరుగులేని హామీ ఇస్తుంది. రియల్ మి నార్జో 70 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మి యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.
టచ్ చేయకుండానే.. ఎయిర్ గెస్చర్స్..
రియల్ మి నార్జో 70 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ స్వైప్ (Swipe), పాయింట్ (Point), గో (Go).. వంటి 10+ రకాల ఎయిర్ గెస్చర్ల (Air Gestures) ను సపోర్ట్ చేస్తుంది. అంటే, ఫోన్ ను టచ్ చేయకుండానే, ఫోన్ స్క్రీన్ పై చేతిని కదిలించడం ద్వారా ఆపరేట్ చేసే సౌలభ్యం ఈ రియల్ మి నార్జో 70 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ లో ఉంది. ఈ ఎయిర్ గెస్చర్ ఫీచర్స్ ను ఇన్స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (YouTube) వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లలో కూడా ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో 67వాట్ సూపర్ వూక్ ఛార్జ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది కేవలం 19 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు చార్జ్ చేయగలదని రియల్ మి పేర్కొంది.
రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ధర, లభ్యత
రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ (Realme Narzo 70 Pro 5G) స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అవి 128 జీబీ, 256 జీబీ. 128 జీబీ వేరియంట్ ధర రూ.19999 కాగా, 256 జీబీ వేరియంట్ ధర రూ.21,999. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై రూ.2000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. రియల్మీ నార్జో 70 ప్రో 5జీతో రూ.2299 విలువైన రియల్మీ టీ 300 బడ్స్ను ఉచితంగా పొందొచ్చు. రియల్ మి నార్జో 70 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఎర్లీ బర్డ్ సేల్ ఈ రోజు, మార్చి 19 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది బ్రాండ్ వెబ్సైట్ లో, అలాగే, అమెజాన్ (Amazon) లో మార్చి 22, మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.