Amazon smartphone Holi sale : ఈ స్మార్ట్​ఫోన్స్​పై సూపర్​ డిస్కౌంట్స్​​.. మిస్​ అవ్వకండి!-amazon smartphone holi sale from iphone 13 to honor x9b get up to 38 discount ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Amazon Smartphone Holi Sale: From Iphone 13 To Honor X9b, Get Up To 38 Discount

Amazon smartphone Holi sale : ఈ స్మార్ట్​ఫోన్స్​పై సూపర్​ డిస్కౌంట్స్​​.. మిస్​ అవ్వకండి!

Sharath Chitturi HT Telugu
Mar 19, 2024 06:11 AM IST

Amazon smartphone Holi sale : తక్కువ ధరకే మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇదే రైట్​ టైమ్​! అమెజాన్​ స్మార్ట్​ఫోన్​ హోలీ సేల్​లో పలు మోడల్స్​పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ​ డిస్కౌంట్స్​
ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ​ డిస్కౌంట్స్​ ( HT Tech)

Amazon smartphone Holi sale : ఏదైనా పండుగ సమీపిస్తోంది అంటే ఈ-కామర్స్ వెబ్​సైట్లు.. టాప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డీల్స్, డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. రంగుల పండుగ హోలీలో కూడా ఇదే జరుగుతోంది! అమెజాన్.. ఇప్పటికే తన స్మార్ట్​ఫోన్స్​పై​ హోలీ సేల్​ని ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 13, పోకో ఎం 6 ప్రో, హానర్ ఎక్స్ 9బీ వంటి టాప్ స్మార్ట్​ఫోన్స్​పై భారీ తగ్గింపుతో పాటు ఆఫర్లను అందిస్తోంది. మీరు మీ స్మార్ట్​ఫోన్​ని అప్​గ్రేడ్​ చేసుకోవాలన్నా.. లేదా ఎవరికైనా గిఫ్ట్​ చేయాలన్నా.. ఇదే రైట్​ టైమ్​! ఈ నేపథ్యంలో సేల్​లోని స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

అమెజాన్ స్మార్ట్ ఫోన్ హోలీ సేల్..

యాపిల్ ఐఫోన్ 13: మన్నికైన పనితీరు కారణంగా ఐఫోన్ 13 ఇప్పటికీ ఉత్తమ స్మార్ట్​ఫోన్స్​లో ఒకటిగా ఉంది. ఇందులో 6.1 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్ప్లే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సిస్టెమ్, ఇది వివిధ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, స్మార్ట్ హెచ్డిఆర్ 4, నైట్ మోడ్, 4 కె డాల్బీ విజన్ హెచ్డిఆర్ రికార్డింగ్​తో పాటు మరెన్నో సపోర్ట్ చేస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఐఫోన్ 13 స్మూత్ అండ్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం ఏ15 బయోనిక్ చిప్​తో పనిచేస్తుంది. అమెజాన్​లో 17 శాతం డిస్కౌంట్​తో రూ.49,499కే ఈ స్మార్ట్​ఫోన్​ని కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు..
Display: 6.1-inchRear camera: 12MP
Chipset: A15 BionicFront camera: 12MP
Battery: 3227mAhStorage: 128GB

హానర్ ఎక్స్9బీ: 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో 6.78 ఇంచ్​ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇందులో అందించారు. హానర్ ఎక్స్9బీ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. ఇది స్మూత్ గేమింగ్ అనుభవం కోసం అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. 108 మెగాపిక్సెల్ వైడ్, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్​ని ఈ స్మార్ట్​ఫోన్​ కలిగి ఉంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5800 ఎంఏహెచ్ డీఎక్స్ గోల్డ్ లై-పో బ్యాటరీని ఇందులో అందించారు. హోలీ సేల్ సందర్భంగా అమెజాన్ నుంచి 16 శాతం డిస్కౌంట్​తో ఈ స్మార్ట్​ఫోన్​ని పొందవచ్చు.

స్పెసిఫికేషన్లు..
Display:  6.78-inchRear camera: 108MP
Chipset: Snapdragon 6 Gen 1 Front camera: 16MP
Battery: 5800mAhStorage: 256 GB

ఐక్యూ జెడ్9: ఐక్యూ జెడ్9 స్మార్ట్​ఫోన్​లో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 2వ జనరేషన్ 4ఎన్ఎం ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేయనుంది. ఐక్యూ జెడ్9 డ్యూయల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 కెమెరా విత్ ఓఐఎస్, 2 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. అమెజాన్ హోలీ సేల్లో ఈ స్మార్ట్​ఫోన్​పై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు..
Display: 6.67-inchRear camera: 50MP
Chipset: MediaTek Dimensity 7200Front camera: 16MP
Battery: 5000mAhStorage: 128GB

పోకో ఎం6 ప్రో: పోకో ఎం6 ప్రో 6.79 ఇంచ్​ అడాప్టివ్ సింక్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది. డిస్ ప్లే 90 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. స్నాప్​డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్​తో ఈ ఫోన్ పనిచేయనుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్​ ఇందులో అందించారు. పోకో ఎం6 ప్రోలో 22.5వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అమెజాన్ హోలీ సేల్​లో పోకో ఎం6 ప్రో 38 శాతం డిస్కౌంట్​తో లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు..
Display: 6.79-inchRear camera: 50MP
Chipset: Snapdragon 4 Gen 2Front camera: 8MP
Battery:  5000mAhStorage: 128GB

WhatsApp channel