Instagram Followers : త్వరగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెంచుకునేందుకు ఏం చేయాలి?-how to increase instagram followers quickly simple tips for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instagram Followers : త్వరగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెంచుకునేందుకు ఏం చేయాలి?

Instagram Followers : త్వరగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెంచుకునేందుకు ఏం చేయాలి?

Anand Sai HT Telugu
Jan 21, 2024 09:30 AM IST

Instagram Followers : ఇన్‌స్టాగ్రామ్‌ అనేది ఇప్పుడు ట్రెండింగ్. దీనిలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అదో ఆనందం. అయితే ఎలా ఫాలోవర్స్ పెంచుకోవాలని తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు.

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగేందుకు చిట్కాలు
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగేందుకు చిట్కాలు (unsplash)

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. రోజూ కోట్ల మంది దీనిని వాడుతుంటారు. ఎన్నో ఫొటోలు, ఎన్నో వీడియోలు. సామాన్యుడిగా మెుదలై ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో సెలెబ్రిటీలు అయినవారు ఉన్నారు. ఎక్కువ మంది సామాన్యులు ఈ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు. అలాగే సెలబ్రిటీలు క్రమం తప్పకుండా ఇక్కడ తమ ముఖాలను చూపుతూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని కొత్త ఫీచర్లు రోజురోజుకు దాని వినియోగదారుల సంఖ్యను పెంచుతున్నాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు సంపాదించాలనుకునే వారికి అనుచరులు చాలా ముఖ్యం.

మీ ఖాతాలో ఫాలోవర్లను వేగంగా పెంచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు అనుసరించాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ క్రియేట్ చేస్తే సరిపోదు. దానిలో అప్డేట్స్ ఉండాలి. అప్పుడే మీకు ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. Instagramలో ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం..

Facebook ద్వారా Instagram ఖాతాను క్రియేట్ చేస్తే మంచిది. ఇది Instagramని ఉపయోగించే మీ Facebook స్నేహితులకు మీ కొత్త Instagram ఖాతా గురించి తెలుపుతుంది. ఫలితంగా మీకు తెలిసిన స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని ఫాలో అవుతారు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రాథమికంగా ఫోటో షేరింగ్ యాప్. ఇక్కడ ఫాలోవర్లను పెంచుకోవడానికి మీరు తప్పనిసరిగా మంచి HD Photos పోస్ట్ చేయాలి. మీరు షేర్ చేసే ఫోటోల నాణ్యత, స్పష్టత, ఆకర్షణను ఆధారంగా ఫాలోవర్స్ పెరుగుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లప్పుడూ అధిక నాణ్యత, స్పష్టమైన ఫొటోలను అప్‌లోడ్ చేయండి.

హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం మరిచిపోవద్దు. మీరు Instagramకి అప్‌లోడ్ చేస్తున్న ఫోటోతో అనుబంధించబడిన హ్యాష్‌ట్యాగ్ (#)ని ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. దీని ద్వారా చాలా మంది మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోలను చూస్తారు. రీచ్ ఎక్కువగా ఉంటుంది. సరైన, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తే వేలలో మీకు లైక్స్ వస్తాయి దీంతో ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. చాలా మంది వ్యక్తుల ఫోటోలు కూడా ఇలానే వైరల్ అవుతాయి. హ్యాష్‌ట్యాగ్ చాలా ముఖ్యం.

ఇన్‌స్టా రీల్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్. మీరు బర్రెలు కాస్తున్నా, మేకలు కాస్తున్నా.. వాటితో కలిపి రీల్స్ తీసినా వైరల్ అవుతూ ఉంటారు. తక్కువ సమయంలో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చిన్న వీడియోలు చేయడం ద్వారా మీరు చాలా త్వరగా ఇతరుల దృష్టిని ఆకర్షించవచ్చు. ఇక్కడ మీరు ఫిట్‌నెస్, వంట, కామెడీ, డ్రాయింగ్, జోకులు, చిట్కాలు ఇలా.. వివిధ రకాల వీడియోలను అప్‌లోడ్ చేయెుచ్చు.

మరో ట్రిక్ ఏంటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన వారికి కింద కామెంట్స్ చేస్తూ ఉండండి. జనాదరణ పొందిన వ్యక్తుల పోస్ట్‌లను వ్యాఖ్యానిస్తే మీ కామెంట్స్ కి లైక్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్రొఫైల్ చూసేందుకు చాలా మంది వస్తారు. ఇది మీకు రెండు ప్రయోజనాలను ఇస్తుంది. మీరు మీ ఖాతాను దీని ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు. ఇతర జనాదరణ పొందిన వ్యక్తుల పోస్ట్‌లపై వ్యాఖ్యానించినప్పుడు, చాలా మంది వ్యక్తులు మీ కామెంట్స్ చూస్తారు. మీ వ్యాఖ్యలను చూసి కొంత మంది మీ ప్రొఫైల్‌కి వచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ట్రెండింగ్ అంశాలతో కొత్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ చాలా మంది ఫాలోవర్లను వేగంగా పొందుతారు. మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచుకోవడానికి ఈ ట్రిక్ పాటించండి. మీరు పోస్ట్ చేసిన చిత్రాలపై వచ్చే కామెంట్స్ కి కూడా స్పందించాలి. ఇక ఆఖరిగా ముఖ్యమైనది ఏంటంటే.. మీరు క్రమం తప్పకుండా పోస్టులు పెడుతూ ఉండాలి. ఏదైనా ఫోటో లేదా వీడియో ఇవ్వాలి. ఇలా ఫాలోవర్లను త్వరగా పెంచుకునేందుకు అవకాశం ఉంది.