Facebook post: హోంమంత్రిపై ఫేస్‌బుక్ పోస్ట్, వైసీపీ కార్యకర్త అరెస్ట్…-ycp worker arrested for posting against home minister ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Facebook Post: హోంమంత్రిపై ఫేస్‌బుక్ పోస్ట్, వైసీపీ కార్యకర్త అరెస్ట్…

Facebook post: హోంమంత్రిపై ఫేస్‌బుక్ పోస్ట్, వైసీపీ కార్యకర్త అరెస్ట్…

HT Telugu Desk HT Telugu
Sep 08, 2023 09:49 AM IST

Facebook post: ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి తానేటి వనితకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్‌ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.

హరిబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు
హరిబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు

Facebook post: హోంమంత్రిపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడం కలకం రేపింది. హోంమంత్రికి వ్యతిరేకంగా పోస్టు పెడతావా అంటూ అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదా వరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన చిన్నం హరిబాబు వైసీపీ అభిమాని. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సామంగా పాల్గొంటారు. ఇటీవల స‌్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

హోంమంత్రి వనిత వద్దంటూ.. కొవ్వూరు సీటును ఆమెకు కేటాయించ వద్దంటూ పోస్టు పెట్టిన రెండు గంటల్లోనే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకోవాలని, కార్యకర్తల రక్తం తాగిన వారు వద్దు, తానేటి వనిత వద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో హరిబాబను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరిబాబను అరెస్ట్‌ చేయడంతో స్థానిక దళిత సంఘాలు, నేతల ఆందోళనకు దిగారు. చివరకు కొవ్వూరు పోలీసులు యువకుడికి 41 నోటీసులు ఇచ్చి పంపించారు.

దొమ్మేరుకు చెందిన చిన్నం హరిబాబు వైసీపీ నాయకుడిగా ఉన్నారు. హోంమంత్రి తీరుతో పార్టీ నష్టపోతుందని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నియోజక వర్గంలో తానేటి వనిత వద్దు. కొత్తవారే ముద్దు అని సోషల్ మీడియాలో బుధవారం హరిబాబు పోస్టు చేశాడు.

ఇది జరిగిన రెండు గంటల్లోనే, హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 12 గంటల పాటు తమ అదుపులో ఉంచుకున్నారు. గంజాయి కేసులు పెడ తామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. 10 తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని బాధితుడు వాపోయాడు.

సమాచారం తెలుసుకున్న హోం మంత్రి వ్యతిరేకవర్గంగా పేరుపడిన నాయకులు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గ ఇన్చార్జి టి.వి. రామారావు, అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. హరిబాబును ఎందుకు అదుపులోకి తీసుకున్నారని పటణ సీఐ జగదీశ్వరరా వును నిలదీశారు. నాయకలు స్టేషన్‌ణు ముట్టడించారని తెలియడంతో కొవూరు డిఎస్సీ వీ.ఎస్. ఎన్ వర్మ పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

ఆందోళన చేస్తున్న నాయకులతో చర్చించిన తర్వాత హరిబాబును విడిచిపెట్టారు. వివిధ వర్గాలను ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో హరిబాబుపై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ తెలిపారు. మరోవైపు హోంమంత్రి తానేటి వనిత పతనం మొదలైందని ఎంపీ హర్షకుమార్ హెచ్చరించారు. ఓట్లేసి గెలిపించిన వారినే అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. విమర్శలకు తట్టుకోలేక సొంత పార్టీ వారినే అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Whats_app_banner