Instagram Shopping: ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Instagram Shopping: ఇన్‌స్టాగ్రామ్‌లో దుస్తులు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొనే వారి సంఖ్య చాలా ఎక్కువ. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Instagram Shopping: ఇన్‌స్టాగ్రామ్‌లో జోరుగానే ఆన్లైన్ షాపింగ్ జరుగుతోంది. చీరలు, చుడీదార్లు, పిల్లల దుస్తులు, జడ క్లిప్పులు, ఆర్టిఫిషియల్ జువెలరీ... ఇలా ఎన్నో ఉత్పత్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్ముతున్నారు. అక్కడే ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్ పేమెంట్ చేసి ఉత్పత్తులను పొందుతున్నారు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉండడంతో ఎక్కువమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది.
ప్రతి బ్రాండ్‌లో సైజులు భిన్నంగా ఉంటాయి. నడుము, ఛాతీ విషయంలో సరైన సైజు ఎంచుకోవాలి. ప్రాంతాన్ని బట్టి సైజ్ చార్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి యూకే లేదా యూఎస్ సైజు చార్టులు పెట్టిన ఖాతాల్లో దుస్తులు కొనుక్కోవడం మంచిది. ఈ రెండు సైజు చార్టుల్లో తేడా తక్కువగానే ఉంటుంది.
ఎప్పుడూ రిటర్న్ పాలసీలను ముందుగానే తనిఖీ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రెస్సులు ఆర్డర్ చేశాక రిటర్న్ పాలసీ సరిగా లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. ఆ డ్రెస్సు మీకు సెట్ కాకపోయినా లేక చిరిగిపోయినా తిరిగి రిటర్న్ ఇవ్వడం కష్టంగా మారొచ్చు. కాబట్టి ఎవరు అమ్ముతున్నారో వారితో ఇవన్నీ ముందుగానే మాట్లాడడాలి. కంపెనీ పాలసీలను చూసుకున్నాకే ఆర్డర్ చెయ్యాలి. అలాగే కామెంట్లలో రివ్యూలను కూడా చదువుకోవాలి. నెగిటివ్ కామెంట్లు కనిపిస్తే... ఆ ఖాతాలో కొనకపోవడమే మంచిది.
ఇన్‌స్టాగ్రామ్ లో దుస్తులు ఆర్డర్ పెట్టాలనుకునే వారు ఎప్పుడూ క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడం మంచిది. ఆన్లైన్ లో చెల్లించడం వల్ల ఆ ఇన్స్ స్టాగ్రామ్ ఖాతా నకిలీతో, నిజమైనదో కనిపెట్టలేం. కొంతమంది ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేయని సందర్భాలు ఉన్నాయి. దీని వల్ల మీరు డబ్బును నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడం వల్ల ఉత్పత్తి మీరు అందుకున్నాకే డబ్బులు చెల్లించాలి కాబట్టి, పూర్తిగా సేఫ్. ఇన్‌స్టాగ్రామ్ లో ఇలాంటి మోసాలు చాలా సార్లు జరిగాయి.
ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి దుస్తులు లేదా ఉత్పత్తులు ఆర్డర్ పెడుతున్నప్పుడు ఆ ఖాతాను క్షుణ్ణంగా పరిశీలించండి. వారు ఎప్పటి నుంచి దాన్ని నడుపుతున్నారో కనిపెట్టండి. అలాగే ప్రతి ఫోటోకు పెట్టిన కామెంట్‌ను చదవండి. నెగిటివ్ కామెంట్స్ అధికంగా ఉంటే ఆర్డర్ పెట్టకపోవడమే మంచిది. పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటే వారు కచ్చితంగా ప్రోడక్ట్ ను అందిస్తారని అర్థం.
టాపిక్