Jio Mart on Whatsapp: జియో మార్ట్ సేవలు ఇక వాట్సాప్ లో..-jio mart offers shopping on whatsapp with discounts and cashback offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Jio Mart Offers Shopping On Whatsapp With Discounts And Cashback Offers

Jio Mart on Whatsapp: జియో మార్ట్ సేవలు ఇక వాట్సాప్ లో..

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 07:28 PM IST

Jio Mart on Whatsapp: వాట్సాప్ ద్వారా వినియోగదారులు షాపింగ్ చేసే అవకాశాన్ని రిలయన్స్ గ్రూప్ నకు చెందిన ఈ కామర్స్ సంస్థ జియో మార్ట్ కల్పిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Jio Mart on Whatsapp: ప్రముఖ ఆన్ లైన్ మార్కెంటింగ్ సంస్థ జియో మార్ట్ వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా మరో అడుగు వేసింది. ఇకపై ఈ జియో మార్ట్ ఈ- కామర్స్ సైట్ నుంచి వినియోగదారులు వాట్సాప్ ద్వారా షాపింగ్ చేయవచ్చు. తమకు కావాల్సిన వస్తువులను వాట్సాప్ నుంచే ఆర్డర్ చేయవచ్చు. ఈ మేరకు వాట్సాప్ తో జియోమార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Jio Mart on Whatsapp: ఈ కామర్స్ విప్లవం

భారత్ లో ఈ కామర్స్ విప్లవం కొనసాగుతోంది. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియోమార్ట్ సహా పలు సంస్థలు ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ చైన్ స్టోర్స్ ఉన్న జియో మార్ట్ ఈ రేసులో దూసుకుపోతోంది. వెబ్ సైట్, యాప్ ల ద్వారానే కాకుండా, వాట్సాప్ చాట్ నుంచి కూడా షాపింగ్ చేసుకునే అవకాశం తాజాగా జియోమార్ట్ కల్పించింది. వాట్సాప్ లోనే ఉత్పత్తులను సెలెక్ట్ చేసుకుని, పేమెంట్ చేసి, ఉచితంగా డెలివరీ పొందవచ్చు. ఇందులో మినిమం ఆర్డర్ షరతులేవీ లేవని జియోమార్ట్ వెల్లడించింది.

Jio Mart on Whatsapp: జియోమార్ట్ నెంబర్

వాట్సాప్ ద్వారా జియోమార్ట్ లో షాపింగ్ చేయడానికి జియో మార్ట్ నెంబర్ +917977079770 ను సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత, ఆ నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని కానీ, ‘Great deals on JioMart’ అని కానీ టైప్ చేసి పంపించాలి. వెంటనే వాట్సాప్ లోనే షాపింగ్ క్యాటలాగ్, కరెంట్ అఫైర్స్ మరియు డీల్స్ పై నోటిఫికేషన్లు వస్తాయి. వాట్సాప్ ద్వారా జియోమార్ట్ లో షాపింగ్ చేసిన తరువాత కార్ట్ వివరాలు, ఆర్డర్ స్టేటస్ మొదలైనవి కూడా వాట్సాప్ నుంచే తెలుసుకోవచ్చు. అలాగే, షాపింగ్ కు లేదా ఆర్డర్లకు సంబంధించి కస్టమర్ కేర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది.

Jio Mart on Whatsapp: ఆఫర్లు..

జియోమార్ట్ ను వినియోగదారులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో వాట్సాప్ షాపింగ్ పై జియోమార్ట్ కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. కనీసం రూ. 250 విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే, కనీసం 30% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ లో గరిష్టంగా రూ. 120 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

WhatsApp channel

టాపిక్