Lava Yuva 5G vs Poco M6 5G: రూ.10,000 లోపు ధరలో ఈ రెండు 5 జీ స్మార్ట్ ఫోన్స్ లో ఏది బెటర్?
Lava Yuva 5G vs Poco M6 5G: లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన లావా యువ 5జీ, పోకో ఎం6 5 జీ స్మార్ట్ ఫోన్స్ లో ఏ ఫోన్ మంచిదన్న కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ ను, ఫీచర్స్ ను మీ కోసం ఇక్కడ వివరిస్తున్నాం.
Lava Yuva 5G vs PocoM6 5G: శక్తివంతమైన స్పెసిఫికేషన్లు, ప్రీమియం లుక్ డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో లావా యువ 5జీ, పోకో ఎం6 5జీ స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. రూ.10,000 లోపు ధరలో, అన్ని ఫీచర్లతో ఉన్న బడ్జెట్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, లావా యువ 5 జీ, లేదా పోకో ఎం 6 5 జీ లను పరిశీలించవచ్చు. ఈ రెండు ఫోన్స్ లోని స్పెసిఫికేషన్ల మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ చూడండి.
లావా యువ 5 జీ వర్సెస్ పోకో ఎం 6 5 జీ
డిస్ప్లే: లావా యువ 5 జీలో 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.52 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. పోకో ఎం6 5జీలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 6.74 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో 600 అంగుళాల పీక్ బ్రైట్ నెస్ ఉన్నాయి. పోకో స్మార్ట్ ఫోన్ హెచ్ డీ రిజల్యూషన్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ పరంగా చూస్తే లావా యువ 5జీ డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. పోకో ఎం6 5జీ స్మార్ట్ఫోన్లో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే లావా స్మార్ట్ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ కెమెరా, పోకో ఎం6 లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
పనితీరు: స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం లావా యువ 5జీలో యూనిసోక్ టి 750 ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మరోవైపు పోకో ఎం 6లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ను అందిస్తుంది.
సాఫ్ట్ వేర్: లావా యువ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కస్టమైజ్డ్ యుఐతో పనిచేస్తుంది. పోకో ఎం6 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయుఐ 14 పై పనిచేస్తుంది.
బ్యాటరీ: లావా యువ 5 జీ, అలాగే, పోకో ఎం6.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీలను పొందుపర్చారు. అయితే పోకో ఎం6 10వాట్ అడాప్టర్ తో వస్తుంది.
ధర: లావా యువ 5జీ ప్రారంభ ధర రూ.9499 కాగా, పోకో ఎం6 ప్రారంభ ధర రూ.10,499గా ఉంది.