Best camera phones : రూ. 25వేల బడ్జెట్లో ది బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
Best camera phones under ₹25,000 : రూ.25,000 లోపు మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమ్! మే 2024లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
Best camera smartphones in India May 2024 : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి వారం ఏదో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేస్తూ.. కస్టమర్లకు చాలా ఆప్షన్స్ ఇస్తుంటాయి టెక్ సంస్థలు. అదే సమయంలో.. ఇన్ని ఆప్షన్స్ మధ్య ఏ స్మార్ట్‌ఫోన్ కొనాలి? అన్ని అయోమయం కూడా కస్టమర్లలో ఉంటోంది. మరి.. ఒక మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? రూ. 25వేల బడ్జెట్లో ఉండాలా? అయితే ఇది మీకోసమే.. ఇండియాలో, ఈ మేలో రూ. 25వేల ధరలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
రూ. 25వేల బడ్జెట్లో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్..
1) టెక్నో కామోన్ 30:
8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది. టెక్నో కామోన్ 30 5జీ స్మార్ట్‌ఫోన్.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 1080 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ వస్తుంది. డాల్బీ సౌండ్ సపోర్ట్, ఎన్ఎఫ్సీ, ఐపీ53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో డ్యూయెల్ స్పీకర్ సెటప్‌తో తాజా టెక్నో డివైజ్ వస్తుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో కామోన్ 30 5జీ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కి మద్దతు ఇస్తుంది.
టెక్నో కామోన్ 30 5జీ వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ఓఐఎస్ మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఎఫ్ / 2.45 ఆపరేచర్తో 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ ఉంది.
2. రియల్మీ 12 ప్రో:
best camera smartphones in India : 8 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. రియల్మీ 12 ప్రో.. 4ఎన్ఎం ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్తో పనిచేస్తుంది.
6.7 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 2412×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఈ రియల్మీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇది 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
రియల్మీ 12 ప్రో ప్రత్యేకత.. దాని ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో టెలిఫోటో, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 లెన్స్‌తో వస్తుంది. డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 709 లెన్స్, ఓఐఎస్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్ మద్దతుతో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఎఫ్ / 2.2 లెన్స్ కెమెరా సెటప్ పూర్తి చేస్తుంది.
రియల్మీ లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. 67 వాట్ల సూపర్వూక్ ఛార్జర్‌ను ఉపయోగించి 28 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. రియల్మీ యూఐ 5.0 ఆధారిత ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
3) వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4:
One Plus Nor CE 4 price in India : 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .24,999. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 2412×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. 210 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యుఎం డిమ్మింగ్, హెచ్డిఆర్ 10+ కలర్ సర్టిఫికేషన్, 10-బిట్ కలర్ డెప్త్ సపోర్ట్ లభిస్తుంది.
ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసితో పనిచేస్తుంది. ఇది గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం అడ్రినో 720 జీపీయుతో కనెక్ట్ చేసి ఉంటుంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి 600 ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయెల్ రియర్ కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది.
4) రెడ్మీ నోట్ 13 ప్రో:
Redmi Note 13 pro price : 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .22,999. రెడ్మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్.. 1.5 కె రిజల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 6.67 ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్తో పనిచేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనులను నిర్వహించడానికి అడ్రినో 710 జీపీయూతో కనెక్ట్ చేసి ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో ఐపీ 54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంది.
సంబంధిత కథనం