Realme GT 6T : ఇండియాలో రియల్​మీ జీటీ 6టీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!-realme gt 6t launch date in india revealed know expected specs price features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Gt 6t : ఇండియాలో రియల్​మీ జీటీ 6టీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Realme GT 6T : ఇండియాలో రియల్​మీ జీటీ 6టీ లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
May 13, 2024 03:30 PM IST

Realme GT 6T launch in India : రియల్​మీ జీటీ 6టీ.. ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. లాంచ్​ డేట్​తో పాటు ఫీచర్స్​, ధర వివరాలను చూసేయండి..

రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​ వచ్చేస్తోంది..
రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​ వచ్చేస్తోంది.. (Realme)

Realme GT 6T price in India : రియల్​మీ జీటీ 6టి.. గత కొంతకాలంగా టాక్ ఆఫ్ ది టౌన్​గా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ డిజైన్, ధర, స్పెసిఫికేషన్లను వెల్లడించే పనిలో టిప్​స్టర్లు ఉన్నారు. ఇక ఇప్పుడు.. ఈ మొబైల్​ ఇండియా లాంచ్​ను అధికారికంగా ప్రకటించింది రియల్​మీ సంస్థ. స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన మెటాలిక్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ను కూడా రివీల్​ చేసింది. ఈ నేపథ్యంలో రియల్​మీ జీటీ 6టీ లాంచ్​ డేట్​, ఎక్స్​పెక్టెడ్​ ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భారతదేశంలో రియల్​మీ జీటీ 6టీ లాంచ్ డేట్​..

దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్ ప్రకారం.. రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​..  మే 22, 2024న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుంది. నానో మిర్రర్ డిజైన్​తో సిల్వర్ కలర్ ఆప్షన్​ను ప్రదర్శించే ఈ స్మార్ట్​ఫోన్ బ్యాక్ ప్యానెల్​ను రియల్​మీ రివీల్​ చేసింది. ఇందులో డ్యూయెల్ కెమెరా సెటప్, రెండు ఎల్ఈడీ ఫ్లాష్ లైట్లు ఉన్నాయి.

'నోటిఫై మి' బటన్ ఆప్ట్​ చేసుకునే యూజర్లకు రియల్​మీ లక్కీ డ్రా అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఎంపికైన వారికి రియల్​మీ జీటీ 6టీ, రియల్​మీ బడ్స్ టీ110, రియల్​మీ బడ్స్ 2, తదితర గ్యాడ్జెట్స్​ని బహుమతిగా ఇస్తారు. రాబోయే రియల్​మీ జీటీ 6టీ, దాని ఎక్స్​పెక్టెడ్​ స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

రియల్​మీ జీటీ 6టీ స్పెసిఫికేషన్లు

Realme GT 6T launch in India : 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. రియల్​మీ జీటీ 6టీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ హై బ్రైట్​నెస్ మోడ్​తో 6.78 ఇంచ్​ ఎల్టీపీవో అమోఎల్ఈడీ స్క్రీన్ ఉండనుంది. ఈ స్మార్ట్​ఫోన్​.. స్నాప్​డ్రాగన్​ 7 + జెన్ 3 ఎస్ఓసితో పనిచేస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇది ఎంటియూ బెంచ్​మార్క్​ ప్లాట్​ఫామ్​లో 1.5 మిలియన్లకు పైగా పాయింట్లు సాధించింది. రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.

50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రధాన కెమెరా, ఓఐఎస్​తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఈ స్మార్ట్​ఫోన్​లో ఉండే అవకాశం ఉంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 సెల్ఫీ కెమెరాను అందించారు.

పలు మీడియా కథనాల ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ .31999. అంటే.. ఇదొక మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ అని అర్థం చేసుకోవచ్చు.

Realme GT 6T price : ఏదేమైనా, పైన పేర్కొన్న స్పెసిఫికేషన్లు లీకులు, ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయని గమనించండి. మే 22తో ఈ రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వివరాలపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ సమయంలో మేము మీకు అప్డేట్​ చేస్తాము.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి.

WhatsApp channel

సంబంధిత కథనం