Realme Narzo smart phones launch: భారత్ లో రియల్ మీ నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్!
Realme: మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ రియల్ మీ నుంచి రియల్ మీ నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ అనే రెండు స్మార్ట్ ఫోన్లు ఇవాళ లాంచ్ అయ్యాయి. ఆ రెండు స్మార్ట్ ఫోన్స్ ధరలు, స్పెసిఫికేషన్స్.. తదితర వివరాలు ఇక్కడ మీ కోసం..
నార్జో 70 5జీ సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ను రియల్ మీ (Realme) భారత్ లో లాంచ్ చేసింది. అవి రియల్ మీ నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్. వీటిలో ఫోన్ ను చల్లగా ఉంచడానికి థర్మల్ మేనేజ్మెంట్ కోసం వేపర్ ఛాంబర్ ను ఏర్పాటు చేసింది.
రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ
రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల సూపర్ వూక్ ఛార్జ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో అల్ట్రా స్మూత్ డిస్ ప్లే, 50 ఎంపీ ఏఐ కెమెరా ఉన్నాయి. ఇందులో డైమెన్సిటీ 6100+ 6ఎన్ఎం 5జీ ప్యాకేజీలో వీసీ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇది సెగ్మెంట్ యొక్క అత్యంత సన్నని 7.69 మిమీ అల్ట్రా-స్లిమ్ బాడీని కలిగి ఉంది. రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ మిస్టీ ఫారెస్ట్ గ్రీన్, స్నో మౌంటైన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అవి 1) 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్. దీని ధర రూ .11999. 2) 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్. దీని ధర రూ .13499.
రియల్ మీ నార్జో 70 5జీ
రియల్ మీ నార్జో 70 5జీ ((Realme Narzo 70 5G)) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్ సెట్ ఉంది. ఇది ఈ సెగ్మెంట్ లో అతిపెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ఏఐ కెమెరాను పొందుపర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో 45వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మిస్టీ ఫారెస్ట్ గ్రీన్, స్నో మౌంటెన్ బ్లూ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా రెండు స్టోరేజ్ వేరియంట్లలో కూడా లభిస్తుంది. అవి 1) 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ .15999. 2) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ .16999.
రియల్ మీ ఆఫర్స్
నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) 4జీబీ+128జీబీ వేరియంట్ పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అందించే కొన్ని లాంచ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. వీరికి రూ.1000 విలువైన కూపన్ లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.1500 విలువైన కూపన్ లభిస్తుంది. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో 70ఎక్స్ 5జీ ‘ఎర్లీ బర్డ్ సేల్’ ఏప్రిల్ 24 న ప్రారంభమైంది. ఇది కేవలం 2 గంటలు (సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు realme.com లేదా Amazon.in లో చెక్ చేసుకోవచ్చు. రియల్ మీ నార్జో 70 5జీ ఎర్లీ బర్డ్ సేల్ ఏప్రిల్ 25న (మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు) జరగనుంది. ఈ సేల్ లో రియల్ మీ నార్జో 70 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999గానూ, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. అదనంగా, ఈ మోడళ్ల కోసం ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఫ్లాష్ సేల్ జరగనుంది.