Smartphones discounts: ఐ ఫోన్ 14 సహా ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్
Smartphones discounts: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? 2024 ఏప్రిల్ నెలలో ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, వివో వంటి ప్రధాన బ్రాండ్ లు తమ ప్రీమియం రేంజ్ మోడళ్లపై ధరలను తగ్గించాయి. ఆ టాప్ డీల్స్ ఇక్కడ చూడండి.
Smartphones discounts: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏప్రిల్ నెలలో వన్ ప్లస్, షియోమీ, ఆపిల్ వంటి ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ పాపులర్ ఫోన్ల ధరలను తగ్గించాలని నిర్ణయించారు. భారీ డిస్కౌంట్ లభించే స్మార్ట్ ఫోన్స్ ఇవే..
1. వన్ ప్లస్ 11 5జీ
వన్ ప్లస్ 11 5 జీ (OnePlus 11 5G) స్మార్ట్ ఫోన్ 2023 ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మోడల్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్, సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999 కాగా, ఇప్పుడు వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో, డిస్కౌంట్ అనంతరం కేవలం రూ.51,999 లకే లభిస్తుంది. ఈ వేరియంట్ ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
2.శాంసంగ్ గెలాక్సీ ఏ34
శాంసంగ్ గెలాక్సీ ఏ 35 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో ప్రవేశపెట్టిన వెంటనే శాంసంగ్ తన గెలాక్సీ ఏ 34 5జీ (Samsung Galaxy A34) మోడల్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. శాంసంగ్ ఇండియా వెబ్సైట్ లో ప్రస్తుతం గెలాక్సీ ఎ 34 5 జీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ రూ .24499 లకు లభిస్తుంది. మీకు ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అవసరమైతే, 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ. 26499 లకు లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ .32999.
3. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ (OnePlus Nord CE 3 5G) స్మార్ట్ ఫోన్ ధరను కూడా తగ్గించారు. గత సంవత్సరం జూలైలో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ను లాంచ్ చేశారు. ఈ 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ .24,999 లకు లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ .26,999. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 నుంచి రూ.27,999కు తగ్గింది.
4. వివో వై16
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన వివో వై16 (Vivo Y16) బేస్ మోడల్ ధర రూ.10,499 నుంచి రూ.9,999కు తగ్గింది. అదేవిధంగా 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.11,999 నుంచి రూ.10,999కు తగ్గింది. గతేడాది సెప్టెంబర్లో భారత్ లో లాంచ్ అయిన వివో వై16 స్మార్ట్ ఫోన్ లో హెచ్డీ+ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా తదితర ఫీచర్స్ ఉన్నాయి.
5.. ఐఫోన్ 14
ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) కూడా ఇప్పుడు ఆకర్షణీయమైన తగ్గింపుతో లభిస్తుంది.ఈ ఫోన్ ను 2022 లో లాంచ్ చేశారు. ఆపిల్ ఐ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 ఒరిజినల్ ధర రూ.79,900 కాగా, ఇప్పుడు అమెజాన్ లో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 21 శాతం డిస్కౌంట్ తో రూ.62,800 లకు లభిస్తుంది. అదనంగా, వినియోగదారులు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.