OnePlus Nord CE 3 Specifications: వన్‍ప్లస్ తదుపరి చౌక ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్-oneplus nord ce 3 specifications leaked ahead of launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus Nord Ce 3 Specifications Leaked Ahead Of Launch

OnePlus Nord CE 3 Specifications: వన్‍ప్లస్ తదుపరి చౌక ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2022 11:36 AM IST

OnePlus Nord CE 3 Specifications: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. వచ్చే ఏడాది బడ్జెట్ రేంజ్‍లో లాంచ్ కానున్న ఈ 5జీ ఫోన్‍‍కు సంబంధించిన స్పెసిఫికేషన్లను ఓ టిప్‍స్టర్ వెల్లడించారు.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్లు (Photo: OnePlus)
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్లు (Photo: OnePlus)

OnePlus Nord CE 3 Specifications: పాపులర్ బ్రాండ్ వన్‍ప్లస్ సాధారణంగా నార్డ్ సిరీస్‍ (Nord Series) లో మిడ్ రేంజ్ ఫోన్‍లను తీసుకొస్తుంటుంది. ఈ సంవత్సరమే నార్డ్ సీఈ లైనప్‍ను మొదలుపెట్టి.. నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) ఫోన్‍ను రూ.20వేలలోపు ధరకు లాంచ్ చేసింది. ఈ రేంజ్‍లో వన్‍ప్లస్ తొలి ఫోన్ ఇదే. అయితే ఇప్పుడు ఈ మోడల్‍కు అప్‍గ్రేడ్‍ను తెచ్చేందుకు వన్‍ప్లస్ పని చేస్తోంది. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ (OnePlus Nord CE 3 5G) ని తీసుకురానుంది. దీని గురించి వన్‍ప్లస్ వివరాలు వెల్లడించకపోయినా.. లీక్‍ల ద్వారా దాదాపు స్పెసిఫికేషన్లు అన్ని బయటికి వచ్చేశాయి. దీన్నిబట్టి నార్డ్ 2 సీఈ కంటే తదుపరి మోడల్ మంచి అప్‍గ్రేడ్‍లతో వస్తోందని తెలుస్తోంది. మరి వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 5జీకి సంబంధించి లీక్ అయిన స్పెసిఫికేషన్లు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

OnePlus Nord CE 3 leaked Specifications : వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్లు

ప్రముఖ టిప్‍స్టర్ ఆన్‍లీక్స్ తో కలిసి వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 స్పెసిఫికేషన్లను గాడ్జెట్‍గ్యాంగ్ లీక్ చేసింది. దీని ప్రకారం, 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేతో నార్డ్ సీఈ 3 రానుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తోంది. సీఈ 2 5జీతో పోలిస్తే ఇది పెద్ద సైజ్ డిస్‍ప్లే, అధిక రిఫ్రెష్ రేట్.

OnePlus Nord CE 3 5G మొబైల్‍లో స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుందని ఆ రిపోర్టులో వెల్లడైంది. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్‍గా ఉంటుందని తెలుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక లెన్స్ ఉంటాయని లీక్‍ల ద్వారా వెల్లడైంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు ఉంటాయట. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ వస్తుందని తెలుస్తోంది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉండనుండగా.. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని లీక్‍లు వచ్చాయి. చార్జింగ్ కోసం యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

OnePlus Nord CE 3 launch : లాంచ్ ఎప్పుడు?

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ వచ్చే ఏడాది లాంచ్ కానుంది. 2023 తొలి అర్ధభాగంలోనే వన్‍ప్లస్ ఈ ఫోన్‍ను తీసుకురావొచ్చు. ఇది కూడా రూ.20వేల రేంజ్‍లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఫోన్ గురించి వన్‍ప్లస్ టీజ్ చేసే అవకాశం ఉంది.

WhatsApp channel

టాపిక్