OnePlus 11 5G marble Odyssey: మార్బుల్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‍తో వన్‍ప్లస్ 11 5జీ కొత్త వేరియంట్: సేల్ ఎప్పుడంటే!-oneplus 11 5g marble odyssey revealed by oneplus sale on june 6 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 11 5g Marble Odyssey: మార్బుల్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‍తో వన్‍ప్లస్ 11 5జీ కొత్త వేరియంట్: సేల్ ఎప్పుడంటే!

OnePlus 11 5G marble Odyssey: మార్బుల్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‍తో వన్‍ప్లస్ 11 5జీ కొత్త వేరియంట్: సేల్ ఎప్పుడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 29, 2023 05:39 PM IST

OnePlus 11 5G Marble Odyssey: వన్‍ప్లస్ 11 5జీకి మార్బుల్ ఒడిసే స్పెషల్ ఎడిషన్‍‍ను వన్‍ప్లస్ ప్రకటించింది. సేల్ డేట్‍ను వెల్లడించింది.

మార్బుల్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‍తో వన్‍ప్లస్ 11 5జీ కొత్త వేరియంట్ (Photo: OnePlus)
మార్బుల్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‍తో వన్‍ప్లస్ 11 5జీ కొత్త వేరియంట్ (Photo: OnePlus)

OnePlus 11 5G Marble Odyssey: వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ మొబైల్‍కు ఓ కొత్త డిజైన్ వేరియంట్ వచ్చింది. ‘వన్‍ప్లస్ 11 5జీ మార్బుల్ ఒడిసే’ స్పెషల్ వేరియంట్‍ను వన్‍ప్లస్ ఆవిష్కరించింది. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ ప్రత్యేకమైన.. మార్బుల్ ఫినిష్‍తో ఉంటుంది. చూడడానికి అచ్చం మార్బుల్‍లా కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్‍ను టచ్ చేసినా మార్బుల్ ఫీలింగ్ ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ సేల్ డేట్‍ను వన్‍ప్లస్ ప్రకటించింది. వన్‍ప్లస్ 11 జీ మార్బుల్ ఒడిసే స్పెషల్ ఎడిషన్ వివరాలు ఇవే.

మార్బుల్‍లా బ్యాక్ ప్యానెల్

మైక్రో క్రిస్టలీన్ రాక్ మెటీరియల్‍తో వన్‍ప్లస్ 11 5జీ మార్బుల్ ఒడిసే ఎడిషన్ మొబైల్ బ్యాక్‍ప్యానెల్ రూపొందించినట్టు వన్‍ప్లస్ పేర్కొంది. దీంతో మార్బుల్‍గా కనిపిస్తుందని, విజువల్ టెక్స్చర్ అలాగే ఉంటుందని తెలిపింది. దీంతో ఈ ఫోన్ లుక్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. ఈ వన్‍ప్లస్ 11 5జీ ఫోన్‍కు ఈ మార్బుల్ ఒడిసే ఎడిషన్‍ను పరిమితంగానే తీసుకొస్తున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది.

సేల్ డేట్ ఇదే

వన్‍ప్లస్ 11 5జీ మార్బుల్ ఒడిసే ఎడిషన్ ఫోన్ జూన్ 6వ తేదీన ఈ-కామర్స్ సైట్ అమెజాన్, వన్‍ప్లస్ అఫీషియల్ వెబ్‍సైట్‍లో సేల్‍కు వస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ధరను వన్‍ప్లస్ అతిత్వరలో ప్రకటించే అవకాశం ఉంది. లేకపోతే సేల్ రోజు వెల్లడిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ వన్‍ప్లస్ 11 5జీ ప్రారంభ ధర రూ.56,999గా ఉంది.

బ్యాక్ ప్యానెల్ మినహా వన్‍ప్లస్ 11 5జీ మొబైల్‍ స్పెసిఫికేషన్లనే ఈ మార్బుల్ ఒడిసే ఎడిషన్ కూడా కలిగి ఉంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 శక్తివంతమైన ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‍డీ రెజల్యూషన్ అమోలెడ్ డిస్‍ప్లే‍తో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‍డీఆర్10+, డీసీ డిమ్మింగ్ ఉంటాయి.

వన్‍ప్లస్ 11 5జీ వెనుక మూడు హాసెల్‍బ్లాడ్ కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX980 ప్రైమరీ, 48 మెగాపిక్సెల్ సోనీ IMX581 అల్ట్రా వైడ్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీతో వన్‍ప్లస్ 11 5జీ వచ్చింది. 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్ని విభాగాల్లో ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్ కలిగి ఉంది. మార్బుల్ ఒడిసే ఎడిషన్ కూడా ఇదే స్పెసిఫికేషన్‍లను కలిగి ఉంటుంది.

256జీబీ స్టోరేజ్ ఉండే వన్‍ప్లస్ 11 5జీ మార్బుల్ ఒడిసే స్పెషల్ ఎడిషన్ ధర రూ.64,999గా ఉంటుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది.

Whats_app_banner

సంబంధిత కథనం