Vivo Y16 4G । బడ్జెట్ ధరలో మరొక 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన వివో!
వివో సరికొత్త Vivo Y16 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది రూ. 15 వేల లోపు బడ్జెట్లో లభిస్తుంది. మరి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్లో మరో కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. Vivo Y16 పేరుతో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇది బడ్జెట్ ధరలో లభించే ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో HD+ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ స్టైల్ నిచ్‌తో సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ చిప్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంది.
స్టోరేజ్ పరంగా సరికొత్త Vivo Y16 స్మార్ట్‌ఫోన్ ఏకైక 4GB RAM కాన్ఫిగరేషన్లో లభిస్తుంది. అయితే అదనంగా 1GB వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది. స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Vivo Y16 భారతీయ మార్కెట్లో Moto G52, Redmi Note 10S, Samsung Galaxy F22 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతుంది. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర మొదలైన వివరాలు ఈ కింద చెక్ చేయండి.
Vivo Y16 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్
- వెనకవైపు 13MP+2MP కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
- ధర, రూ. 12,499/-
అయితే, ఈ ధరకు మార్కెట్లో ఇంతకంటే మెరుగైన ఫీచర్లతో వివిధ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు లభిస్తున్నాయి. మరి Vivo Y16 కంపెనీ ఇంకాస్త తగ్గించగలదో లేదో చూడాలి.
సంబంధిత కథనం