Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 7 వేల భారీ డిస్కౌంట్, ఇప్పుడు ధర ఎంతంటే?-samsung galaxy f23 5g gets discount of rs 7000 check new price ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Samsung Galaxy F23 5g Gets Discount Of Rs 7000, Check New Price

Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 7 వేల భారీ డిస్కౌంట్, ఇప్పుడు ధర ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Sep 08, 2022 10:10 PM IST

శాంసంగ్ కంపెనీ తమ Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. మెరుగైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. వివరాలు చూడండి.

Samsung Galaxy F23 5G
Samsung Galaxy F23 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు శాంసంగ్ తమ బ్రాండ్ నుంచి విడులయ్యే ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు డిస్కౌంట్లను ప్రకటించడంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా తమ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌పై ఏకంగా రూ. 7 వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది. మీరు మంచి ఫీచర్లు కలిగిన మధ్య-శ్రేణి 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకు ప్రస్తుతం మార్కెట్లో Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాని అసలు ధర కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, మీ వద్ద ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే అదనపు ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఆఫర్ కింద,రూ. 23,999 ధర కలిగిన Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపుపుతో రూ. 16,999 ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అలాగే ICICI కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుచేసే వారికి అదనంగా రూ. 1,000 తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన ప్రకటన కంపెనీ వెబ్‌సైట్‌లో లైవ్ ఇచ్చారని నివేదికలు తెలిపాయి.

మరి ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో మరోసారి ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 6GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP +8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

Galaxy F13లో ఇంకా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/A-GPS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

అయితే, స్మార్ట్‌ఫోన్ బాక్సులో ఛార్జర్ ఉండదు, దీనిని విడిగా ఆర్డర్ చేయవలసి ఉంటుంది. ఛార్జర్ ధర రూ. 1,299 అయినప్పటికీ, వెబ్‌సైట్ నుండి దీన్ని కేవలం రూ. 299కి ఆర్డర్ చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్