Samsung Galaxy F13 । ఆటోమేటిక్ డేటా స్విచింగ్ ఫీచర్‌తో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్!
శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల అయింది. ఇది సరసమైన ధరలోనే లభించే బడ్జెట్ ఫోన్, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జూన్ 29 నుంచి ఈ ఫోన్ Samsung ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సహా కొన్ని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. వాటర్‌ఫాల్ బ్లూ, సన్‌రైజ్ కాపర్, నైట్‌స్కీ గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభించనుంది.
Samsung Galaxy F13 ఒక బడ్జెట్ కేటగిరీ స్మార్ట్‌ఫోన్. స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో వచ్చింది. రూ.15 వేల లోపే ఈ ఫోన్ మీకు లభ్యమవుతుంది. ఈ స్టైలిష్ హ్యాండ్‌సెట్‌లో భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది USB-C ఆధారిత 15W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. మరింత సామర్థ్యం కోసం అడాప్టివ్ పవర్-సేవ్ , AI పవర్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌లను ఇచ్చారు. ఈ ఫీచర్‌లు ఫోన్‌లోని యాప్‌లను మూడు రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉంచగలవు. అలాగే ఒక నెల పాటు ఉపయోగించని యాప్‌లను డీప్ స్లీప్ మోడ్‌లో ఉంచుతాయి కాబట్టి అవి బ్యాక్‌గ్రౌండ్‌లో శక్తిని వినియోగించవు. దీంతో బ్యాటరీ ఎక్కువ కాలం ఉంటుంది.
అంతేకాదు Galaxy F13 ఫోన్ ఆటోమేటిక్ డేటా స్విచింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. దీంతో ప్రైమరీ SIM నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఉన్నట్లయితే మొబైల్ డేటా కనెక్షన్‌ని ఆటోమేటిక్‌గా రెండవ SIMకి మారుస్తుంది.
ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంత, ఎప్పట్నించి అందుబాటులో ఉంటుంది తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Samsung Galaxy F13 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
- 4 GB ర్యామ్, 64 GB/128 GB ఇంటర్నల్ స్టోరేజ్
- ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్
- వెనకవైపు 50 MP +5MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జర్
Galaxy F13లో ఇంకా 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB టైప్-C పోర్ట్ ఛార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy F13 స్మార్ట్‌ఫోన్ ధర 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.11,999 అలాగే 4 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.12,999/- ధరలకు అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం