Telugu Cinema News Live November 26, 2024: Pushpa 2 Shooting: పుష్ప 2 షూటింగ్ పూర్తయింది.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 26 Nov 202403:18 PM IST
- Pushpa 2 Shooting: పుష్ప 2 షూటింగ్ మొత్తానికి పూర్తయింది. రిలీజ్ కు మరో పది రోజులు ఉండగా షూటింగ్ పూర్తయినట్లు అల్లు అర్జున్ మంగళవారం (నవంబర్ 26) ఓ ఫొటో షేర్ చేశాడు.
Tue, 26 Nov 202402:58 PM IST
- Sayani Gupta Kiss: డైరెక్టర్ కట్ చెప్పినా ఓ నటుడు తనకు కిస్ ఇస్తూనే వెళ్లాడని చెప్పింది పలు వెబ్ సిరీస్ లలో బోల్డ్ పాత్రలు పోషించిన సయానీ గుప్తా. స్క్రీన్ పై శృంగార సన్నివేశాలు చేయడంపై తన అనుభవాన్ని ఆమె వివరించింది.
Tue, 26 Nov 202412:18 PM IST
- Akhil Akkineni Engagement: అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రౌజీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు అతని తండ్రి, నటుడు అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Tue, 26 Nov 202412:02 PM IST
- OTT Thriller Movie: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ తొమ్మిది నెలల తర్వాత వచ్చింది. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే ఈ సినిమా.. ఈ ఏడాది ఫిబ్రవరి 23న రిలీజ్ కాగా.. మరో మూడు రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది.
Tue, 26 Nov 202410:47 AM IST
- OTT Crime Thriller: ఓటీటీలోకి ఇప్పుడో తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన ఈ మూవీ.. సుమారు నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
Tue, 26 Nov 202410:18 AM IST
- Singer Mangli Got Ustad Bismillah Khan Award: టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం లభించింది. తన గొంతుతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సింగర్ మంగ్లీకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్ వరించింది. న్యూ ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మంగ్లీ అందుకున్నారు.
Tue, 26 Nov 202408:29 AM IST
- Bigg Boss Telugu 8 Ticket To Finale Task: బిగ్ బాస్ తెలుగు 8లో టికెట్ టు ఫినాలే రేస్‌ను ఇవాళ్టి నుంచి ప్రారంభించనున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు టికెట్ టు ఫినాలే టాస్క్‌లను నిర్వహించేందుకు మాజీ కంటెస్టెంట్స్ అయిన బ్రహ్మముడి మానస్, జబర్దస్త్ పింకీ, అఖిల్ సార్థక్, అలేఖ్య హారిక హౌజ్‌లోకి వెళ్లారు.
Tue, 26 Nov 202407:19 AM IST
Samantha second hand Comments: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తనపై జరిగిన ట్రోలింగ్‌పై ఎమోషనల్‌గా స్పందించింది. అలానే పెళ్లి గౌనుని రీ-మోడల్ చేయించడంపై కూడా ఓపెన్ అయ్యింది.
Tue, 26 Nov 202407:14 AM IST
- Nindu Noorella Saavasam November 26th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 26 ఎపిసోడ్‌లో అమర్, భాగీ లోపల ఏం చేస్తున్నారో అని కంగారుగా డిస్టర్బ్ చేస్తుంది మనోహరి. ఇంతలో స్నానం చేస్తున్నట్లుగా వచ్చి తమ రొమాన్స్‌ను కవర్ చేస్తాడు అమర్. అది కాదని మనోహరి వాదిస్తుంటే శివరామ్, నిర్మల వార్నింగ్ ఇస్తారు.
Tue, 26 Nov 202406:00 AM IST
Trending OTT Movies Telugu On Netflix: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వాటిలో అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు ఉంటాయి. అయితే, ఇవాళ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు, అందులో ఉన్న తెలుగు బెస్ట్ 5 మూవీస్‌పై ఓ లుక్కేద్దాం.
Tue, 26 Nov 202405:30 AM IST
Kanguva Box Office Collection: కంగువా సినిమా రూ.2,000 కోట్లు వసూళ్లు సాధిస్తుంటూ రిలీజ్‌కి ముందు ప్రొడ్యూసర్ కె.ఇ.జ్ఞానవేల్ బాహాటంగా ప్రకటించాడు. కానీ.. డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత వసూళ్లు రాబట్టిందంటే?
Tue, 26 Nov 202404:42 AM IST
- Ram Pothineni Rapo 22 Music Directors From Tamil: ఉస్తాద్ రామ్ పోతినేని నటించనున్న తర్వాత రాపో22కి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయనున్నారు. తమిళంలో మంచి పాపులారిటీ ఉన్న సంగీత దర్శక ద్వయం వివేక్ శివ, మెర్విన్ సాల్మన్ రామ్ పోతినేని అప్‌కమింగ్ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
Tue, 26 Nov 202404:34 AM IST
Director Ram Gopal Varma Case: ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చుట్టూ ఉచు బిగిస్తోంది. ఇప్పటికే అతడ్ని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కి ఒంగోలు పోలీసులు వెళ్లగా..?
Tue, 26 Nov 202403:15 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial November 26 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 26 ఎపిసోడ్‌లో సుశీల వెళ్లి వస్తానని, మంచి అత్తగా ఉండమని, లేకుంటే నాలాంటి కోడలు వస్తే ఏకాకి జీవితం అవుతుందని అంటుంది. మీ అమ్మగారు శాపనార్థాలు పెడుతున్నారు అని సత్యంను అంటుంది ప్రభావతి. మీనా ఒక్కపూటే తింటానంటుంది.
Tue, 26 Nov 202402:14 AM IST
Brahmamudi Serial November 26th Episode: బ్రహ్మముడి నవంబర్ 26 ఎపిసోడ్‌లో కావ్యను తీసుకురానని తెగేసి చెబుతాడు రాజ్. రోడ్డుమీద కల్యాణ్, అప్పు పానీపురి తింటుంటే అనామిక వచ్చి అవమానిస్తుంది. తర్వాత ఆస్తి కోసం కొత్త స్కెచ్ వేసిన రుద్రాణి పనిమనిషిని కావాలనే వెళ్లగొట్టేలా చేస్తుంది.
Tue, 26 Nov 202401:41 AM IST
- Karthika Deeapam November 26 Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్‍ను సీఈవో పదవి నుంచి తొలగించేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నను కొత్త సీఈవోగా చేస్తాడు. దీంతో కార్తీక్ షాకిచ్చినా.. మళ్లీ వెనక్కి తగ్గుతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Tue, 26 Nov 202401:05 AM IST
- Bigg Boss Telugu 8 Thirteenth Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ కాస్తా హీట్ హీట్ ఆర్గ్యుమెంట్స్ మరికొంత సాఫ్ట్‌గా సాగిపోయాయి. ఒక్కరోజులోనే బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు.