Telugu IPL Players List: ఐపీఎల్ 2025 వేలంలో మెరిసిన మన తెలుగు క్రికెటర్లు.. 18 మంది వేలానికి వస్తే ఐదుగురికే ఛాన్స్
IPL 2025 Auction Telugu cricketers: ఐపీఎల్ 2025 మెగా వేలానికి 18 మంది తెలుగు క్రికెటర్లు తమ పేర్లని నమోదు చేసుకున్నారు. ఇందులో కేవలం ఐదుగురిని మాత్రమే ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. వేలానికి ముందే ఇద్దరు ఆటగాళ్లని రిటెన్ చేసుకున్నాయి.
ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోయిన తెలుగు క్రికెటర్స్ (HT_PRINT)
ఐపీఎల్ 2025 వేలం ముగిసింది. అబుదాబిలోని జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం జరిగిన ఈ ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలంలో మొత్తం 10 ఫ్రాంఛైజీలు రూ.639.15 కోట్లని ఖర్చు చేసి 182 మంది ఆటగాళ్లని కొనుగోలు చేశాయి. ఇందులో భారత్, విదేశీ క్రికెటర్లు కూడా ఉండగా.. తెలుగు రాష్ట్రాలకి చెందిన ఐదుగురు క్రికెటర్లకీ చోటు దక్కింది.
- హైదరాబాద్‌కి చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకి గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సిరాజ్ ఆడాడు.
- గుంటూరుకి చెందిన షేక్ రషీద్‌ను రూ. 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో షేక్ రషీద్ చెన్నై టీమ్‌లోనే ఉన్నాడు.
- కాకినాడకి చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజుని రూ.30 లక్షలకి ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేసింది.
- శ్రీకాకుళంకు చెందిన స్పిన్నర్ త్రిపురణ విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకి కొనుగోలు చేసింది
- విశాఖపట్నంకు చెందిన క్రికెటర్ పైల అవినాష్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకి కొనుగోలు చేసింది
ఐపీఎల్ 2025 వేలానికి వచ్చినా అమ్ముడుపోని తెలుగు క్రికెటర్లు
- ఆంధ్రా రంజీ జట్టుకి వికెట్ కీపర్‌గా ఉన్న కేఎస్ భరత్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి భరత్ ఆడాడు.
- ఆంధ్రా క్రికెటర్ బైలపూడి యశ్వంత్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు
- తెలంగాణకి చెందిన ఆరవెల్లి అవనీశ్‌కి కూడా ఐపీఎల్ 2025 వేలంలో నిరాశ తప్పలేదు.
ఐపీఎల్ 2025 వేలానికి ముందే ఫ్రాంఛైజీలు రిటేన్ చేసుకున్న తెలుగు క్రికెటర్లు
- హైదరాబాద్‌కి చెందిన తిలక్ వర్మని రూ.8 కోట్లకి ఐపీఎల్ 2025 వేలానికి ముందే ముంబయి ఇండియన్స్ రిటెన్ చేసుకుంది.
- విశాఖపట్నంకు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకి వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటేన్ చేసుకుంది.
ఇంకా చదవండి తాజా క్రికెట్ వార్తలు.