తెలుగు న్యూస్ / ఫోటో /
Nitish Kumar Reddy: మెరుపు హిట్టింగ్‍తో అదరగొట్టిన సన్‍రైజర్స్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి.. ఎవరు ఈ ప్లేయర్?
- Nitish Kumar Reddy: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. బౌలింగ్‍లో ఓ వికెట్ తీశాడు. హైదరాబాద్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ తెలుగు ప్లేయర్ నితీశ్ గురించిన వివరాలివే..
- Nitish Kumar Reddy: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి 37 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. బౌలింగ్‍లో ఓ వికెట్ తీశాడు. హైదరాబాద్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ తెలుగు ప్లేయర్ నితీశ్ గురించిన వివరాలివే..
(1 / 5)
ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ టీమ్‍తో నేడు (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‍లో 37 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 64 పరుగులతో అదరగొట్టాడు. ఎస్‍ఆర్‌హెచ్ 39 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు దూకుడైన బ్యాటింగ్‍తో ఆదుకున్నాడు. దీంతో ఇతడు ఎవరు అంటూ చాలా మంది నెట్టింట వెతికేస్తున్నారు. (AFP)
(2 / 5)
దేశవాళీ క్రికెట్‍లో ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 17 రంజీ మ్యాచ్‍ల్లో 566 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేస్ బౌలింగ్ వేసే నితీశ్ 52 వికెట్లు పడగొట్టాడు. ఇక, లిస్ట్-ఏ క్రికెట్‍లో 22 మ్యాచ్‍ల్లో 403 పరుగులు, 14 వికెట్లు తీసుకున్నాడు. 2003లో విశాఖపట్నంలో నితీశ్ జన్మించాడు.(AP)
(3 / 5)
ఆంధ్రప్రదేశ్ తరఫున వివిధ ఏజ్ గ్రూప్‍ల్లో ఆడుతూ వచ్చాడు నితీశ్. క్రమంగా సత్తాచాటుతూ రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2020లో దేశవాళీ క్రికెట్‍లో ఆంధ్రా తరఫున అరంగేట్రం చేసి నిలకడగా రాణిస్తున్నాడు.(PTI)
(4 / 5)
ఐపీఎల్ 2023 సీజన్ ముందు జరిగిన వేలంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నితీశ్ కుమార్‌ను రూ.20లక్షలకు తీసుకుంది. గత 2023 సీజన్‍లో రెండు మ్యాచ్‍లు ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‍లో రెండు వికెట్లు తీశాడు. ఇక, ప్రస్తుతం ఈ 2024 సీజన్‍లో పంజాబ్‍తో మ్యాచ్‍లో దుమ్మురేపాడు. ఐపీఎల్‍లో తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. (PTI)
ఇతర గ్యాలరీలు