IMD Cyclone Warning: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయల సీమల్లో భారీ వర్షాలు-low pressure area strengthening in bay of bengal heavy rains in south coast and rayalaseema ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Imd Cyclone Warning: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయల సీమల్లో భారీ వర్షాలు

IMD Cyclone Warning: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయల సీమల్లో భారీ వర్షాలు

Nov 25, 2024, 07:42 AM IST Bolleddu Sarath Chandra
Nov 25, 2024, 07:42 AM , IST

  • IMD Cyclone Warning: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో  భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావ రణశాఖ పేర్కొంది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీ ధనంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 25కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుం దంగా బలపడనున్నది. 

(1 / 8)

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. మంగళవారం నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకా రులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

(2 / 8)

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం నవంబర్‌  27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా బలపడుతుందని  అంచనా  వేస్తున్నారు. . అల్పపీడనం 28 వరకు పశ్చిమంగా పయనించి తరువాత బలపడి వాయుగుండంగా మారేక్రమంలో ఉత్తర వాయవ్యంగా పయనించి 28 నాటికి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. 

(3 / 8)

అల్పపీడనం క్రమంగా బలపడి  30వ తేదీ రాత్రి కోస్తాంధ్రలో తీరం దాటుతుంది. మరో అంచనాలో  తీవ్ర అల్పపీడనం 26దీకల్లా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, తరువాత వాయువ్యంగా పయనించి 28వ తేదీ రాత్రికి పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుంది.  రెండు మోడళ్ల ప్రకారం కోస్తాంద్ర రాయలసీమపై  ఎక్కువ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

(4 / 8)

ఐఎండీ, జీఈపీఎస్ ప్రకారం ఆదివారం రాత్రికి వాయుగుండంగా మారి, తరువాత 26 సాయంత్రానికి  బలపడుతుంది. తరు వాత మయన్మార్ వైపు గా వెళుతుంది. ఎన్సీఈపి మోడల్ ప్రకారం కూడా వాయు గుండంగా బలపడిన తరువాత 27 వరకు పశ్చిమ వాయు వ్యంగా పయనించి, మయన్మార్ వైపు వెళ్లనుంది .దీని ప్రకారం సోమ, మంగ శవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురుస్తాయి 

(5 / 8)

 అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 30న కోస్తా, రాయలసీ మలో పలుచోట్ల వరాలు కురుస్తాయని పేర్కొంది. 

(6 / 8)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావ రణ శాఖ పేర్కొంది.

(7 / 8)

వాతావరణ శాఖ హెచ్చరికలతో దక్షిణ కోస్తా, రాయలసీమ  రైతాంగానికి గుబులు పట్టుకుంది. 27 నుంచి 30 వరకు భారీవరాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం. ఖరీఫ్‌లో  రాష్ట్రం అంతటా వరి దండిగా పండింది. కోతలు సాగుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో ప్రాంతాల్లో పత్తి తీతలు పుంజుకున్నాయి. రబీ పంటలు మొలక మొక్క దశలో ఉన్నాయి. ఈ తరుణంలో భారీ వర్షాలు కురిస్తే నష్టం ఖాయమని రైతులు చెబుతున్నారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు